Begin typing your search above and press return to search.

దగ్గుబాటి బ్రదర్స్ కూడా సెట్ అయ్యారు

By:  Tupaki Desk   |   1 Dec 2017 12:21 PM IST
దగ్గుబాటి బ్రదర్స్ కూడా సెట్ అయ్యారు
X
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలు చాలానే ఉన్నారు. ముఖ్యంగా స్టార్ బ్రదర్స్ అని పిలవబడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా - అక్కినేని - నందమూరి అలాగే అల్లు బ్రదర్స్ అనే లిస్ట్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరో ఫ్యామిలీ కూడా జాయిన్ అవ్వబోతోంది. వారు ఎవరో కాదు టాలీవుడ్ లో ప్రముఖంగా చెప్పుకునే దగ్గుబాటి ఫ్యామిలీ.

ఈ ఫ్యామిలీ నుంచి ఫైనల్ గా మరో యువకుడు సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు రానా తమ్ముడు అభిరామ్ హీరోగా రాబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ కథను ఫైనల్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దగ్గుబాటి ఫ్యామిలీ బిజీ అయ్యిందని తెలుస్తోంది. భాను శంకర్ దర్శకత్వం వహించబోయే ఆ సినిమాలో అభిరామ్ సరికొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇక ఈ యువ హీరోకి కరెక్ట్ గా సెట్ అయ్యేలా బ్యూటీ ఫుల్ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారు. ఆమె పేరు మాళవిక శర్మ. రొమాంటికి ఎంటర్టైన్మెంట్ తరహాలో సినిమా ఉండబోతోందట. ఫైనల్ గా అంతా సెట్ అవ్వడంతో త్వరలోనే రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో అధికారకంగా సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.