Begin typing your search above and press return to search.

సోనూసూద్ ని ఆకాశానికెత్తేసిన డాడీ అండ్ స‌న్

By:  Tupaki Desk   |   17 Jan 2021 4:30 AM GMT
సోనూసూద్ ని ఆకాశానికెత్తేసిన డాడీ అండ్ స‌న్
X
సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని మూడు సినిమాల‌తో పోటీప‌డుతూ రిలీజైంది `అల్లుడు అదుర్స్`. బెల్లంకొండ శ్రీ‌నివాస్- న‌భా న‌టేష్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా స‌క్సెస్ వేడుక‌లో బెల్లంకొండ సురేష్‌.. బెల్లంకొండ శ్రీ‌ను ఎంతో ఎగ్జ‌యిట్ అవుతూ ఎమోష‌న‌ల్ స్పీచ్ ని ఇచ్చారు.

మొద‌టిరోజు మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా.. త‌మ సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంద‌ని ఆనందం వ్య‌క్తం చేసారు. ఈ వేదిక వ‌ద్ద సోనూ సూద్ పై డాడీ అండ్ స‌న్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. క‌రోనా క‌ష్ట కాలంలో అత‌డు స్పందించిన తీరు ఆద‌ర్శం అని అత‌డు మాన‌వ‌తావాది అని ప్ర‌శంసించారు బెల్లంకొండ సురేష్. అత‌డు రియ‌ల్ హీరో అంటూ ఆకాశానికెత్తేశారు. చాలా మంది చేయాల‌నుకున్నా అత‌డిలా చేయ‌లేర‌ని కూడా కౌంట‌ర్ వేశారు.

సక్సెస్ మీట్‌లో బెల్లంకొండ శ్రీ‌ను మాట్లాడుతూ..సోను సూద్ చేసిన మంచి పనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతను మానవతా సాయంలో గొప్ప‌వాడు అని ప్రశంసించారు. అల్లుడు అదుర్స్ రిజ‌ల్ట్ ఎలా ఉంది అన్న‌ది థియేట‌ర్ల‌కు వెళ్లి ప్రేక్ష‌కుల్ని చూసి మాట్లాడాల‌ని అన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులను అడగండి. వారు చెప్పేదే నిజ‌మైన రిపోర్ట్ అని అన్నారు. మ‌హ‌మ్మారీ స‌మ‌యంలో `అల్లుడు అదుర్స్` ప్రేక్ష‌కుల‌కు మ‌ధురానుభూతిని మిగిల్చింద‌ని అన్నారు. ఈ చిత్రం కొత్త ఎనర్జీతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే అవకాశాన్ని ఇచ్చిందని బెల్లంకొండ హీరో అన్నారు.