Begin typing your search above and press return to search.
2021NYE గిఫ్ట్..యువ ఏజెంట్ ఆత్రేయకు ఫాల్కే అవార్డు!
By: Tupaki Desk | 2 Jan 2021 10:10 AM ISTసౌతిండియన్ సినిమాకి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను కొత్త సంవత్సరం వేళ ప్రకటించారు. కింగ్ నాగార్జునకు.. ఏజెంట్ ఆత్రేయ నవీన్ పోలిశెట్టి కి ఫాల్కే అవార్డులు దక్కాయి. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`లో నటనకు గాను.. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో నవీన్ అవార్డు గెలుచుకున్నారు. `మోస్ట్ వర్సటైల్ యాక్టర్` విభాగంలో అక్కినేని నాగార్జున అవార్డును అందుకోనుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 అవార్డుల ప్రదానోత్సవం 2021 ఫిబ్రవరి 20 న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ లో జరుగనుంది.
మరిన్ని అవార్డుల వివరాలు పరిశీలిస్తే.. `డియర్ కామ్రేడ్`లో నటనకు రష్మిక మందన్న ఉత్తమ నటిగా.. `సాహో`కు ఉత్తమ దర్శకుడిగా సుజీత్.. జెర్సీ కి గాను ఎస్.ఎస్ తమన్ .. ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును అందుకోనున్నారు.
అసురన్ లో నటనకు గాను ధనుష్ ఉత్తమ నటుడు (తమిళ్) అవార్డును గెలుచుకున్నారు. `రచ్చాసి`కి ఉత్తమ నటి అవార్డును జ్యోతిక విన్ అవ్వకోగా.. `ఓథా సెరుప్పు సైజ్ 7` కి ఉత్తమ దర్శకుడిగా ఆర్ పార్థిపన్.. ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ చిత్రం గా టు లెట్ అవార్డు విన్ అవ్వగా.. ‘మోస్ట్ వెర్సటైల్ యాక్టర్’ అవార్డును అజిత్ గెలుచుకున్నాడు.
కన్నడలో ఉత్తమ చిత్రం- మూకాజ్జియ కణసుగలు. `అవనే శ్రీమనారాయణ`లో నటనకు ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి ఎంపిక కాగా.. ఉత్తమ నటిగా `యజ్ఞాన`లో నటనకు తాన్య హోప్.. అవార్డు అందుకున్నారు. `ప్రీమియర్ పద్మిని`కి గాను రమేష్ ఇంద్ర ఉత్తమ దర్శకుడిగా ఎంపికవ్వగా.. వి హరికృష్ణ ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కించుకున్నారు. శివ రాజ్ కుమార్ అత్యంత బహుముఖ నటుడిగా గౌరవ పుర్కారం దక్కించుకున్నారు.
మలయాళంలో ఉత్తమ చిత్ర విభాగంలో `ఉయ్ రే` పురస్కారం దక్కించుకుంది. `ఆండ్రాయిడ్ కుంజప్పన్`లో నటనకు గాను సూరజ్ వెంజరమూడు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకోగా.. ఉయారేకు పార్వతి తిరువోతు ఉత్తమ నటి గా.. పురస్కారం అందుకుంది. కుంబలంగి నైట్స్ సినిమాకి గాను.. మధు సి నారాయణన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికవ్వగా.. దీపక్ దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును దక్కించుకున్నారు. మోహన్ లాల్ అత్యంత బహుముఖ నటుడిగా గౌరవ పురస్కారం దక్కించుకున్నారు.