Begin typing your search above and press return to search.

బన్నీ, చరణ్ కు ఇచ్చారుగా నాకు కావాలంటే చెప్పుతో కొడతా అన్నారు

By:  Tupaki Desk   |   14 May 2019 5:03 PM IST
బన్నీ, చరణ్ కు ఇచ్చారుగా నాకు కావాలంటే చెప్పుతో కొడతా అన్నారు
X
అల్లు శిరీష్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని చేసిన చిత్రం 'ఏబీసీడీ'. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఏబీసీడీకి ఇది రీమేక్‌ అనే విషయం తెల్సిందే. ఈ చిత్రంను మే 17న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రుక్సాన్‌ థిల్లాన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంకు సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారి నుండి వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ సందర్బంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ సినిమాలోని తండ్రి, కొడుకులకు మాదిరిగానే నాన్నకు నాకు కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.

శిరీష్‌ మాట్లాడుతూ... ఈ సినిమాను చరణ్‌ చెప్పడం వల్ల చేశాను, ఒక్క క్షణం చేస్తున్న సమయంలోనే ఒకసారి చరణ్‌ ను కలిశాను అప్పుడు నాకు మలయాళ సినిమా చేయమని సూచించాడు. అప్పుడు ఆ సినిమా చూశాను. ఆ సినిమా చూస్తున్న సమయంలో నాకు మా నాన్న గుర్తుకు వచ్చాడు. అందులో కొడుకు బాగు కోసం తండ్రి చాలా తపన పడుతూ ఉంటాడు. నిజ జీవితంలో మా నాన్న కూడా నా కెరీర్‌ కోసం చాలా తపన పడ్డాడు.

21 ఏళ్లు వచ్చిన తర్వాత బన్నీకి, చరణ్‌ కి కారు కొనిచ్చారు. అందుకే నాకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత కారు కొనియ్యమని అడిగాను. ఏ కారు కావాలని అడిగితే స్పోర్ట్స్‌ కారు కావాలంటే చెప్పుతో కొడతాను అన్నాడు. నీ వయసు పిల్లలు టూవీలర్స్‌ పై ప్రయాణిస్తు పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ లో ప్రయాణిస్తూ ఉద్యోగాలు చేస్తుంటే నీకు స్పోర్ట్స్‌ కారు ఎందుకు అంటూ కొపగించుకున్నాడు. దాంతో నాకు కసి పెరిగి కష్టపడి మూడు సంవత్సరాల్లో డబ్బు సంపాదించి సొంతంగా కారు కొనుకున్నాను. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కారు కొనివ్వను అన్నప్పుడు నాన్నపై కోపం వచ్చింది, కాని నా సొంత డబ్బుతో కారు కొనుకున్నప్పుడు ఆయన అలా ఎందుకు అన్నాడో అర్థం అయ్యింది. నా సొంత డబ్బుతో కారు కొనుక్కుంటే ఆ కిక్కే వేరు. ఈ చిత్రంలో కూడా నా నిజ జీవితంకు చాలా దగ్గర పాత్రలు ఉంటాయి. అందుకే ఈ చిత్రంను నాన్నకు అంకితం ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.