Begin typing your search above and press return to search.

దబాంగ్‌ దండయాత్ర ఆగదట

By:  Tupaki Desk   |   7 April 2015 7:30 PM GMT
దబాంగ్‌ దండయాత్ర ఆగదట
X
దబాంగ్‌.. బాలీవుడ్‌ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం. తలతిక్క పోలీస్‌గా సల్మాన్‌ వేసిన వేషాలకు జనాలు పిచ్చెక్కిపోయారు. దబాంగ్‌ సినిమాను విరగబడి చూశారు. ఆ తర్వాత ఆ సినిమా తెలుగు, తమిళంతో సహా చాలా భాషల్లో రిలీజై సూపర్‌ హిట్టయింది. దబాంగ్‌ సినిమాను నిర్మించి కాసుల పంట పండించుకున్న సల్మాన్‌ తమ్ముడు అర్బాజ్‌ ఖాన్‌.. దీనికున్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుందామని స్వీయ దర్శకత్వంలో 'దబాంగ్‌-2' తీసి బొక్క బోర్లా పడ్డాడు. దబాంగ్‌-2కు ఓపెనింగ్స్‌ అయితే వచ్చాయి కానీ.. సినిమా పెద్ద ఫ్లాప్‌ అయింది.

దీంతో అంతకుముందు దాకా దబాంగ్‌-3 గురించి మాట్లాడుతూ వచ్చిన అర్బాజ్‌ ఖాన్‌.. తర్వాత ఆ ఊసే ఎత్తడం మానేశాడు. ఐతే ఇప్పుడు మళ్లీ దబాంగ్‌ సీక్వెల్‌ ముచ్చట తెస్తున్నాడు అర్బాజ్‌. వచ్చే ఏడాదో తర్వాతి ఏడాదో దబాంగ్‌-3 కచ్చితంగా పట్టాలపైకి ఎక్కుతుందని చెప్పాడు. ఐతే ఈసారి అర్బాజ్‌ దర్శకత్వం చేయడట. నిర్మాణానికి పరిమితమై.. వేరే దర్శకుడికి బాధ్యతలు అప్పగిస్తాడట. ప్రస్తుతం తన అన్న తీరిక లేకుండా ఉన్నాడని.. డేట్లు ఎప్పుడు ఖాళీ అవుతాయో చూసుకుని.. ఆలోపు స్క్రిప్టు రెడీ చేసి దబాంగ్‌-3 మొదలుపెడతామని చెబుతున్నాడు అర్బాజ్‌. ఐతే కోర్టు కేసుల ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో సల్మాన్‌ కెరీర్‌ రాబోయే ఏళ్లలో ఎలా ఉంటుందో అని నిర్మాతలు టెన్షన్‌ టెన్షన్‌గా ఎదురు చూస్తున్నారు.