Begin typing your search above and press return to search.

సైకిల్ పై సవారీ చేస్తున్న టాలీవుడ్

By:  Tupaki Desk   |   8 Jan 2018 4:34 AM GMT
సైకిల్ పై సవారీ చేస్తున్న టాలీవుడ్
X
సినిమాలలో ప్రాపర్టీలుగా పలు వస్తువులను చూపించడం కొత్తేమీ కాదు. ఒకో సమయంలో ఒకో ఆర్టికల్ కు ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు సైకిల్ ను తెగ ఉపయోగిస్తున్నారు మన ఫిలిం మేకర్స్. రీసెంట్ టైంలో పెద్ద సినిమాలలో ఈ సైకిల్ వినియోగం బాగా పెరిగింది.

శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు సైకిల్ పై వచ్చే సీన్ సూపర్బ్ గా ఉంటుంది. వెనకాల రౌడీలు పరుగెడుతుంటే తోటలో మహేష్ సైకిల్ తొక్కే సీన్.. అభిమానులను కేకలు పెట్టిస్తుంది. ధృవ మూవీలో రామ్ చరణ్ ఇలాగే సైకిల్ తొక్కుతాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ ను ఎక్కించుకుని మరీ కొండ ఎక్కేస్తాడు. మహానుభావుడు మూవీలో శర్వానంద్ కూడా తన లవ్ కోసం సైకిల్ ను పక్కాగా వాడేస్తాడు. ఇప్పుడు అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ సైకిల్ తొక్కే సీన్ కీలకంగా ఉండనుందని ట్రైలర్ లో చెప్పారు. మళ్లీ సైకిల్ ఎక్కుతాడా అనే క్వశ్చన్ ద్వారా.. ఈ సీన్ రెండు సార్లు ఉంటుందని చెప్పకనే చెప్పారు మేకర్స్.

శ్రీమంతుడులో స్టైలింగ్ ప్లస్ పల్లెటూరి నేపథ్యం.. ధృవ మూవీలో హీరో ఫిట్నెస్ ను చాటడం కోసం.. మహానుభావుడులో ప్రేమ ప్లస్ రొమాన్స్.. అజ్ఞాతవాసిలో పక్కా కామెడీ ప్లస్ హీరో మెంటాలిటీ చాటేందుకు సైకిల్ ప్రాపర్టీని ఉపయోగించుకుంటున్నారు మేకర్స్. ఇవి రీసెంట్ సినిమాల జాబితా మాత్రమే. గతంలో ఇలా సైకిల్ ను సినిమాలలో వాడేయడం విరివిగా కనిపించేది. మళ్లీ ఇప్పుడు సైకిల్ కి పూర్వ వైభవం వచ్చినట్లుగా ఉంది.