Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్ స్పేస్ లో ఫ్యాన్ వార్ పై సైబ‌ర్ క్రైమ్ దృష్టి

By:  Tupaki Desk   |   17 Aug 2021 11:30 PM GMT
ట్విట్ట‌ర్ స్పేస్ లో ఫ్యాన్ వార్ పై సైబ‌ర్ క్రైమ్ దృష్టి
X
సోష‌ల్ మీడియాల్లో ట్రోల్స్ ద్వంద్వ యుద్ధాలు ఇక చెల్ల‌వు. దొరికితే జైలే. శిక్ష‌లు క‌ఠినంగా మార‌నున్నాయి. ఇక ఇటీవ‌ల `ట్విట‌ర్ స్పేస్` లో అభిమానుల మ‌ధ్య యుద్ధం స‌రికొత్త‌గా తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అభిమానం పేరుతో అస‌భ్య ప‌ద‌జాలంతో ఒక‌రిపై ఒక‌రు దాడికి దిగుతున్నారు. కొన్నిసార్లు వ్య‌క్తిగత‌ దూష‌ణ‌ల‌కు దిగిపోతున్నారు. మంచి విష‌యాలు పంచుకునే చోట చెడు విష‌యాల‌కు వేదిక‌గా మారుతోంది. మంచి క‌న్నా చెడే ఎక్కువ‌గా ఫోక‌స్ అవుతుంది.

ఓ యువ‌తి ట్విట‌ర్ స్పేస్ లో ఇవ‌న్నీ చూసి తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు. వెంట‌నే ఆమె సైబ‌రాబాద్ పోలీసుల‌ కి ఫిర్యాదు చేసారు. మంచి చూడాల్సిన చోట‌..ఈ చెడు ప‌ద‌జాలాలు ఏంట‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ఇలాంటి వారిని ట్విట‌ర్ నుంచి తొల‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు.

ఇది అత్యంత దారుణ‌మైన నేరం టాంటిద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఫిర్యాదుపై సైబ‌రాబాద్ పోలీసులు స్పందించి సైబ‌ర్ క్రైమ్ విభాగానికి సిఫారుసు చేసారు. దీంతో హీరోల అభిమానాలు కూడా ఫిర్యాదుల వెల్లువ మొద‌లు పెట్టారు. నంద‌మూరి అభిమానుల పై మెగా అభిమానులు ఫిర్యాదులు చేయ‌డం..ప్ర‌తిగా మెగా అభిమానుల‌పై నంద‌మూరి అభిమానులు కంప్లైట్ ఇచ్చుకున్నారు. వివాదానికి సంబంధించిన స్క్రీన్ షాట్ల‌ను కూడా ఫిర్యాదులో పొందుప‌రిచారు. అలాగే `భీమ్లా నాయ‌క్` నుంచి విడుద‌లైన గ్లిమ్స్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన డైలాగ్ పై మ‌హేష్ అభిమానులు కూడా ట్విట‌ర్ స్పేస్ లో మండిప‌డిన సంగ‌తి తెలిసిందే.

ఇద్ద‌రి హీరోల అభిమానులు కూడా అదే వేదిక‌పై తిట్టి పోసుకున్నారు. ఆ త‌ర్వాత కాసేప‌టికి వివాదం చ‌ల్ల‌బ‌డ‌టంతో అంతా కూల్ అయ్యారు. అయితే వీళ్లు ఇంకా సైబ‌ర్ క్రైమ్ రాడార్ కి వెళ్లిన‌ట్లు లేదు. మొన్న‌టి వ‌ర‌కూ ఒక‌రినొక‌రు తిట్టుకోవడానికి ఫేస్ బుక్..వాట్సాఫ్ ని ఎక్కువ‌గా వినియోగించేవారు. ఇప్పుడు ట్విట‌ర్ కొత్త ఫీచ‌ర్ ట్విట్ట‌ర్ స్పేస్ ని తీసుకు రావ‌డంతో ఫ్యాన్ వార్లు అక్క‌డ మొద‌లు పెట్టారు. ఇది అంతం లేని వార్. అదీ సంగ‌తి.