Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : క్యూట్‌ తెలుగమ్మాయి స్టైలిష్ లుక్‌

By:  Tupaki Desk   |   8 April 2022 5:19 AM GMT
ఫోటోటాక్ : క్యూట్‌ తెలుగమ్మాయి స్టైలిష్ లుక్‌
X
తెలుగమ్మాయిలు అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దుగుమ్మలతో పోటీ పడలేరు అని ఉన్న అభిప్రాయంను ఈషా రెబ్బ మరి కొందరు తెలుగు ముద్దుగుమ్మలతో కలిసి మార్చే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఈషా ముంబయి ముద్దుగుమ్మలను మించిన అందాల ఆరబోత చేసేందుకు ఎప్పుడు కూడా వెనకాడదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చూడ్డానికి చక్కనైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తూనే.. అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగా ఉంటుంది. అలాంటి అందం ఈ అమ్మడిది. కనుక పలు సినిమాల్లో ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి.

స్టార్ హీరోలకు సైతం ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ అనడంలో సందేహం లేదు. కాని ఒక్క తెలుగు అమ్మాయి అనే ట్యాగ్‌ వల్ల ఆమెను స్టార్ హీరోలు పక్కన పెడుతున్నారేమో అనిపిస్తుంది.

సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా అమ్మడు అందాల ఆరబోత చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించడం తో పాటు మెల్ల మెల్లగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్‌ లో ముందుకు వెళ్తున్న ఈషా ఈ ఫోటోలతో తాజాగా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ అయ్యింది.

ఈషా రెబ్బ ఎప్పటిలాగే ఈ ఫోటో లో కూడా చాలా క్యూట్‌ గా ఉండటం తో పాటు ఈ బ్లూ స్టైలిష్ డ్రస్ లో మెరిసింది. క్లీ వేజ్‌ షో తో కన్నులు తిప్పుకోకుండా చేస్తున్న ఈషా రెబ్బ ఈ బ్లూ లో అంతకు మించి అన్నట్లుగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈషా రెబ్బ సోషల్‌ మీడియా ఫాలోవర్స్ ఈ ఫోటోలపై లైక్స్‌ వర్షం కురిపిస్తూ కామెంట్స్ ను కుమ్మరిస్తున్నారు.

ఎన్టీఆర్‌ సినిమా అరవింద సమేత సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటించిన తర్వాత మళ్లీ పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ల కోసం ఈఅమ్మడు ఎదురు చూస్తుంది. ఈ ఫోటోలు ఎవరైనా చూస్తే తప్పకుండా మళ్లీ పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్లు దక్కే అవకాశాలు లేకపోలేదు. మరి ఫిల్మ్‌ మేకర్స్‌ ఈ అమ్మడి ఫోటోలను ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.