Begin typing your search above and press return to search.

వీడియో: ఘట్టమనేని యువరాణి క్యూట్‌ ల‌వ్ లీ డ్యాన్సింగ్

By:  Tupaki Desk   |   26 Aug 2020 10:00 AM IST
వీడియో: ఘట్టమనేని యువరాణి క్యూట్‌ ల‌వ్ లీ డ్యాన్సింగ్
X
సీతా పాప ఏం చేసినా ప్ర‌త్యేక‌మే. ముఖ్యంగా డ్యాన్సులంటే సితార‌కు ఎంత ఇష్ట‌మో చెప్పాల్సిన ప‌నే లేదు. ఓవైపు స్కూల్ స్ట‌డీస్ లో ఎంత బుద్ధిగా ఉంటుందో మ‌రోవైపు క‌ల్చ‌ర‌ల్ యాక్టివిటీస్ లోనూ అంతే సిన్సియ‌ర్ గా ఉంటుంది. ఇంత‌కుముందు న‌మ్ర‌త సితార క‌ల్చ‌ర‌ల్ యాక్టివిటీ ప్ర‌ద‌ర్శ‌న‌ల్ని ఇన్ స్టా మాధ్య‌మంలో అభిమానులకు షేర్ చేశారు.

ఇక క్యూట్ సితార ఇంట్లోనే ఉంటే చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు. అల్ల‌రితో కూడుకున్న క్యూట్ డ్యాన్సింగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ``నా అభిమాన కాలక్షేపం ఇది`` అంటూ న‌మ్ర‌త‌.. గత రాత్రి సీతాపాప డ్యాన్సింగ్ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశారు.

ఈ వీడియోలో సితార‌ నృత్య నైపుణ్యం చూపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. బీట్ ని అర్థం చేసుకుంటూ ల‌య‌బ‌ద్ధంగా డ్యాన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తదనుగుణంగా ఆమె కదలికలను సరిపోల్చడం ద్వారా బెట‌ర్ మెంట్ కి ప్ర‌య‌త్నించ‌డం కనిపిస్తోంది. డ్యాన్స్ చేసేటప్పుడు ఆమె ప్రదర్శించే ముఖ‌క‌వ‌లిక‌లు.. స‌రికొత్త‌ ఉత్సాహం చాలా ఆక‌ట్టుకుంటున్నాయి. అయినా ఘట్టమనేని యువరాణి ప్రతిభకు ఫిదా కానిది ఎవ‌రు?