Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : క్యూట్‌ హాట్‌ పాయల్‌ క్రియేటివిటీ షో

By:  Tupaki Desk   |   13 Oct 2021 11:30 AM GMT
ఫొటోటాక్ : క్యూట్‌ హాట్‌ పాయల్‌ క్రియేటివిటీ షో
X
ముద్దుగుమ్మలు ఫొటో షూట్ లు చాలా కామన్‌ అయ్యాయి. ఎంత అందాల ప్రదర్శణ చేసినా కూడా కొన్ని సార్లు జనాలు కనీసం పట్టించుకోవడం లేదు అనేది సెలబ్రెటీలకు కూడా తెలిసి పోయినట్లుంది. అందుకు ఫొటో షూట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ క్రియేటివిటీగా ప్లాన్ చేస్తున్నారు. అందాల ప్రదర్శణతో పాటు బ్యాక్ గ్రౌండ్‌ ఆకట్టుకునే విధంగా లేదా యూనిక్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫొటో షూట్‌ కోసం ఉపయోగించే ప్రాపర్టీస్ కూడా చాలా క్రియేటివ్ గా ఉంటున్నాయి. ఇటీవల లావణ్య త్రిపాఠి కెమెరా పట్టుకుని కెమెరాకు ఫోన్‌ ఇవ్వడం చాలా విభిన్నంగా అనిపించింది. ఇంకా కొందరు కొన్ని కొన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా పాయల్‌ రాజ్ పూత్‌ కూడా అదే ప్రయత్నం చేసింది.

పాయల్‌ చాలా క్యూట్‌ గా కుక్క పక్కన కూర్చుని స్కిన్‌ షో చేసింది. క్లీ వేజ్‌ షో తో పాటు లైగ్స్ అందాలను చూపించే ప్రయత్నం చేసింది. బీచ్ లో ఆమె అలా కూర్చున్న తీరు మరియు ఆమె పక్కన కూర్చున్న తీరు ప్రేక్షకులను నెటిజన్స్ ను ఒక నిమిషం అలా చూస్తూ ఉండేలా చేస్తోంది. అరె భలే ఉండే అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పక్కన్న ఉన్న కుక్క మేలు జాతి కుక్క లేదా డిజైనర్ కుక్క అయ్యి ఉంటే కూడా పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కాని ఒక సాదారణ డాగ్‌ ను ఆమె పక్కన పెట్టుకుని ఉంది. అంతే కాకుండా చాలా క్రియేటివ్‌ గా ఆ కుక్క మరియు పాయల్ కూడా ఒకే వైపు చూడటం యూనిక్ గా అనిపిస్తుంది. కాకతాళీయంగా జరిగిందా లేదా కావాలని ప్లాన్‌ చేసి చేశారా అనేది తెలియదు కాని ఖచ్చితంగా ఇది ఆకట్టుకుందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక పాయల్‌ సినిమాల గురించి టాపిక్‌ వస్తే ఆమె వరుసగా తెలుగు లో మరియు ఇతర భాషల్లో నటిస్తుంది. పెద్ద సినిమాల్లో ఆఫర్లు రాకున్నా మీడియం రేంజ్ సినిమాలో చిన్న సినిమాల్లో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇదే సమయంలో మంచి వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈమె నటించేందుకు సిద్దం అయ్యింది. మారుతి 3 రోజెస్ లో ఒక రోజ్ గా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా కిరాతకుడు సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. మొత్తానికి ఫుల్‌ బిజీగా ఉన్న పాయల్‌ రాజ్ పూత్‌ హీరోయిన్ గానే కాకుండా సోషల్‌ మీడియాలో తన హాట్ ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.