Begin typing your search above and press return to search.

పాత్ర‌లు మాత్ర‌మే ముద్దాడుకున్నాయంటూ క‌వ‌రింగ్!

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:36 AM GMT
పాత్ర‌లు మాత్ర‌మే ముద్దాడుకున్నాయంటూ క‌వ‌రింగ్!
X
దిల్ రాజు సోద‌రుని కుమారుడు ఆశిష్ రెడ్డి క‌థానాయకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ సంగ‌తి తెలిసిందే. రౌడీ బాయ్స్ అనేది టైటిల్. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. హరీష్ కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇక ఈ ట్రైలర్ లో అందాల అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ లిప్ లాక్‌ సహా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో కొత్త హీరోతో జీవించేసింది.

ఈ పెద‌వి ముద్దులు కేవ‌లం యంగ్ హీరోల‌కేనా సీనియ‌ర్ల‌కు లేవా? అంటూ కొంద‌రు కుళ్లుకున్నారు. అనుప‌మ స్పీడ్ కి అభిమానులు.. ప్రేక్షకులు షాక్ కు గురయ్యారు. తరువాత ఆమె ముద్దు సన్నివేశంపై అనేక మీమ్స్ ఆన్ లైన్ లో వచ్చాయి. రౌడీ బాయ్స్ లీడ్ పెయిర్ ఆ మీమ్‌లను చెక్ చేసి అభిమానుల వ్యాఖ్యలకు బిగ్గరగా నవ్వేస్తూ ఆన్స‌ర్స్ ఇచ్చారు. తరువాత అనుపమ లిప్ లాక్ సినిమాలో ఒక భాగం మాత్రమే అని ధృవీకరించడం కొస‌మెరుపు. సినిమాలో తనను ముద్దుపెట్టింది ఆశిష్ పాత్ర మాత్రమేన‌ని అనుప‌మ తెలివైన జ‌వాబు చెబుతోంది.

సినిమాలోని ఇంటిమేట్ సీన్ చూసిన‌ నెటిజనులు మూవీ అంతా చూశాక‌.. త‌మ‌ మనసు మార్చుకుంటారని కూడా ఈ జంట హామీ ఇచ్చింది. జ‌న‌వ‌రి 14న అంటే ఈ సంక్రాంతి సీజ‌న్ కి యువ‌జంట స్పెషల్ ట్రీట్ ని అందివ్వ‌బోతోంది. కాలేజ్ నేప‌థ్యంలో ప్రేమ‌క‌థా చిత్రం కావ‌డంతో ఈ మూవీపై యూత్ లో అంచ‌నాలేర్ప‌డ్డాయి. రౌడీ బోయ్స్ ఏ మేర‌కు రాణిస్తుందో వేచి చూడాలి.