Begin typing your search above and press return to search.

నాగ్ ను చూడ‌డానికి నిజంగానే వ‌చ్చారా?

By:  Tupaki Desk   |   7 March 2018 12:19 PM GMT
నాగ్ ను చూడ‌డానికి నిజంగానే వ‌చ్చారా?
X
నాగార్జున ప్ర‌స్తుతం రామ్‌ గోపాల్ వ‌ర్మ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆఫీస‌ర్ అని టైటిల్ ఖరారు చేసిన ఆ సినిమా షూటింగ్ ముంబైలో సాగుతోంది. ఆ సినిమాలో నాగ్ పోలీసాఫీస‌ర్‌ గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఓ క‌న్‌ స్ట్ర‌క్ష‌న్ ఏరియాలోకి వెళ్లాడు నాగ్‌. అక్క‌డ వంద‌ల కొద్దీ అభిమానులు చుట్టుముట్టేశారు. ముంబైలో కూడా నాగ్‌ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా?

నాగార్జునకు తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌ల కొద్దీ అభిమానులు ఉన్నారు. కాక‌పోతే ఇత‌ర రాష్ట్రాల వారికి నాగ్ హీరో అన్న సంగ‌తి తెలుస్తుంది కానీ అభిమానులు ఉండ‌డం అరుదే. అందులో స‌ల్మాన్‌... షారూఖ్... అమీర్ ఖాన్ లాంటి హీరోలకు భారీగా అభిమానులుంటే ముంబైలో నాగ్‌ కు ఉన్నారంటే మాత్రం సినీజ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బుధ‌వారం ఉద‌యం ముంబైలో షూటింగ్ కోసం వెళ్లిన నాగ్ ద‌గ్గ‌రికి ఒకేసారి వంద‌ల కొద్దీ అభిమానులు వ‌చ్చారు. వారికి కంట్రోల్ చేయ‌డం సెక్యూరిటీకి చాలా క‌ష్ట‌మైపోయిందంటా. నాగార్జున హిందీలో చేసిన సినిమాలు చాలా త‌క్కువ‌. అది కూడా ఎక్కువ శాతం డ‌బ్బింగ్ చిత్రాలే. గ‌త కొంత‌కాలంగా అయితే అవీ కూడా లేవు. అలాంటిది మ‌రీ ఇంత‌మందికి నాగ్ మీద ప్రేమ ఎందుకు పొంగు కొచ్చిందో మ‌రి.

సినీజ‌నాల‌కైతే... ఇదంతా రామ్ గోపాల్ వ‌ర్మ క్రియేట్ చేసిన సీనేమో అన్న అనుమానం కూడా ఉంది. నాగార్జున‌ను ఐస్ చేసేందుకు అత‌నే ఇంత‌మందిని ర‌ప్పించాడేమో అని గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. లేకుంటే తెలుగు హీరో వ‌స్తున్నాడంటే... చూడ్డానికి వ‌చ్చే బాలీవుడ్ జ‌నాలు ఎవరుంటారు? ఏది ఏమైనా తెలుగు హీరో అయిన నాగ్‌ను చూడ్డానికి అంత‌మంది రావ‌డం మ‌న‌కు కాస్త గ‌ర్వ‌కార‌ణ‌మే క‌దా. పోలీ అలా భావించి... హ్యాపీగా ఫీలైపోదాం.