Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: ప్రముఖ వ్యాపార వేత్త అదుపులోకి..
By: Tupaki Desk | 7 Sept 2020 3:00 PM ISTఏదేని కేసు సాల్వ్ చేయడంలో పోలీసులు రెండు కోణాలను వాడుతుంటారు.. ఒకటి ఫ్రెండ్లీ నేచర్‌లో విచారించడం.. మరోటి తాట తీయడం. ఇప్పుడు బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో పోలీసులు సెకండ్ ఆప్షన్‌ను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుండగా.. ఇప్పటికే శాండిల్ వుడ్ ఫేమస్ నటి రాగిణిని అరెస్టు కూడా చేశారు బెంగళూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు. ఆమెతోపాటు మరో 12 మందిపై ఎఫ్‌ఆర్ కూడా నమోదు చేశారు. తాజాగా ఓ బడి వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్‌లోనే విచారిస్తున్నారు.
రాగిణి ద్వివేదిని అరెస్టు చేసిన పోలీసు అధికారులు శనివారం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతితో మూడు రోజులపాటు కస్టడీకి తీసుకున్న వారు.. ఆమెకు ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పకుండా మొండికి వేస్తున్నారని తెలిసింది. ‘నాకేం తెలియదు.. నేను అమాయకురాలిని.. చాక్లెట్ అంటే ఏంటి’ అంటూ బుజ్జాయి ముచ్చట్లు చెబుతోందట. బెంగళూరు నగరంలోని సిద్ధాపురలోని స్టేట్ హోమ్‌లో రాగిణిని పోలీసులు విచారిస్తున్నారు. ఎంత విచారించినా ఏం చెప్పడంలేదట. సోమవారంతో రాగిణి పోలీసు కస్టడీ గడుపు పూర్తి కానుంది. మరింత సమాచారం సేకరించడానికి మరోసారి కస్టడీకి తీసుకోవాలని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సిద్ధం అవుతున్నారని తెలిసింది.
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసును సవాల్‌గా స్వీకరించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం రాత్రి బెంగళూరులో తాజాగా ఓ ప్రముఖ వ్యాపార వేత్తను అదుపులోకి తీసుకున్నారంట. అతను కూడా ఇలాంటి కబుర్లే చెబుతుండడంతో తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చి సమాధానం రాబడుతున్నారు.కొందరు ప్రముఖ వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలను హైప్రొఫైల్ పార్టీలు, ఫంక్షన్లకు ఆహ్వానిస్తున్న సదరు వ్యాపారవేత్త గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానపడుతున్నారు. సోమవారం ఆ వ్యాపార వేత్తను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ఉన్న కొందరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే ఆ వ్యాపార వేత్తను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్నో హైప్రొఫైల్ పార్టీలకు ఆయన డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితులు చెప్పారని సమాచారం. పక్కా సాక్ష్యాలు సేకరించి వ్యాపారవేత్తను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.