Begin typing your search above and press return to search.
PSPKRana: అదిరిపోయే ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్..!
By: Tupaki Desk | 2 July 2021 7:00 PM ISTమలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ లో పలు చేంజెస్ చేశారు. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయింది. ఈ నెల 11వ తేదీ నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభించి ఆగస్ట్ నెలాఖరుకు సినిమా మొత్తం కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.
#PSPKRana చిత్రంలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా.. రిటైర్ట్ హవల్దార్ పాత్రలో రానా నటిస్తున్నారు. ఈగోల కారణంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన వైరం.. ఈ క్రమంలో వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ - రానా మధ్య వచ్చే కీలక సన్నివేశాలతో పాటుగా ఓ ఫైట్ సీన్ ను ప్లాన్ చేస్తున్నారట.
ఇకపోతే ఈ చిత్రంలో మరో నాలుగు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అందులోనూ ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. రెగ్యులర్ ఫైట్ సీన్స్ మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా ఈ యాక్షన్ బ్లాక్ ను డిజైన్ చేస్తున్నారట. దీంట్లో హీరోలిద్దరూ భాగం అవుతారని తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.