Begin typing your search above and press return to search.
'అన్నం - పరబ్రహ్మ స్వరూపం' అంటున్న క్రియేటివ్ డైరెక్టర్..!
By: Tupaki Desk | 11 March 2021 1:00 PM ISTవైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ.. తన తదుపరి సినిమాని ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ''అన్నం'' అనే టైటిల్ ని తన కొత్త సినిమాకు ఖరారు చేసారు కృష్ణ వంశీ. 'పరబ్రహ్మ స్వరూపం' అనేది దీనికి ఉపశీర్షిక. ఈ టైటిల్ డిజైన్ డిఫరెంట్ గా ఉండటంతో పాటు సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ పోస్టర్ లో అరిటాకుపై అన్నం మెతుకులతో రాసిన టైటిల్ తో పాటు వేట కొడవలి - మంగళ సూత్రం - రక్తం మరకలు ఉన్నాయి. అరిటాకు చుట్టూ కాల్ మనీ - ల్యాండ్ మాఫియా - ఫ్రీ స్కీమ్స్ - ఎడ్యుకేషన్ - గవర్నమెంట్ - ఇరిగేషన్ - మెడిసిన్ - మైక్రో ఫైనాన్స్ - కరప్షన్ వంటి టైటిల్స్ కనిపిస్తున్నాయి. ఈసారి కృష్ణ వంశీ సందేశాత్మక అంశాలతో పాటు 'అంతఃపురం' సినిమా తరహా యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడని అర్థం అవుతోంది. ఇకపోతే 'అన్నం' మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలైందని కృష్ణ వంశీ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా కృష్ణ వంశీ ప్రస్తుంతం ''రంగమార్తాండ'' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ - రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బ్రహ్మానందం - అనసూయ - శివాత్మిక - రాహుల్ సిప్లిగంజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది మరాఠీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కృష్ణవంశీ.. 'రంగమార్తాండ' 'అన్నం' సినిమాలతో మళ్ళీ ఫార్మ్ లోకి వేస్తారేమో చూడాలి.