Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బెస్ట్‌ హీరోలు వీరేనంటున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   13 July 2022 2:30 AM GMT
టాలీవుడ్ బెస్ట్‌ హీరోలు వీరేనంటున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌
X
టాలీవుడ్ ప్రేక్షకులకు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దర్శకుడిగా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్‌ అవ్వలేక పోయాడు. దశాబ్ద కాలంగా ఆయన చేసిన సినిమాలేమి కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ ఆయన గతంలో తెరకెక్కించిన సినిమా లే ఇంకా ఆయనను ఒక గొప్ప టెక్నీషియన్‌ అని.. క్రియేటివ్‌ డైరెక్టర్ అనేలా చేస్తున్నాయి.

కృష్ణవంశీ ఎంతో మంది హీరోలతో వర్క్ చేశాడు.. ఆయన తనకు కావాల్సిన నటనను నటీ నటుల నుండి పిండుకుంటాడు అనే అభిప్రాయం.. టాక్ ఉంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్క హీరో గురించి బాహాటంగా మాట్లాడలేని పరిస్థితి.. ఒక్క హీరో ను గురించి మాట్లాడకూడదు అనే పరిస్థితి ఉంది.

ఒక హీరో గురించి పాజిటివ్ గా స్పందిస్తే మరో హీరో అభిమానులు రెచ్చి పోయి విమర్శలు చేసే రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్‌ మీడియా వార్ కు తెర తీసినట్లు అయ్యింది. ఆయన ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు ల పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చకు తెర తీసినట్లు అయ్యింది.

ప్రస్తుత జనరేషన్‌ లో టాలీవుడ్‌ బెస్ట్‌ హీరోలు ఎవరు అంటూ కృష్ణవంశీ ని ప్రశ్నించగా ఆయన ఎన్టీఆర్‌ మరియు మహేష్ బాబు ల యొక్క పేర్లు చెప్పాడు. వీరిద్దరితో మహేష్ బాబు సినిమా లు చేశాడు. ఎన్టీఆర్ తో రాఖీ సినిమా ను చేయగా మహేష్ బాబు తో మురారి సినిమా ను కృష్ణవంశీ చేసిన విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ నటిస్తూ ఉంటే అలాగే ఉండి పోతాము. తాను చేసే నటన అన్నట్లుగా కాకుండా జీవిస్తాడు. ఇక మహేష్ బాబు కూడా అద్భుతమైన నటుడు. ఒక సన్నివేశం కోసం తనను తాను మల్చుకునే తీరు నిజంగా గ్రేట్‌ అన్నట్లుగా కృష్ణవంశీ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇతర హీరోలు ముఖ్యంగా ఆయన ఎవరితో అయితే సినిమా లు చేశాడో ఆ హీరోల యొక్క అభిమానులు రచ్చ చేస్తున్నారు.

కృష్ణవంశీ పై కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన జడ్జ్ మెంట్‌ సరైనదే అయితే ఇన్నాళ్లుగా ఆయన ఎందుకు సక్సెస్ లు దక్కించుకోలేక పోతున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉండగా.. సక్సెస్ లు లేనంత మాత్రాన కృష్ణవంశీ ని తక్కువ చేసి చూడడం కానీ.. తక్కువ చేయడం కానీ చేయవద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.