Begin typing your search above and press return to search.

బిగ్ బీని వెంటాడుతోన్న క్రియేటివ్ డైరెక్ట‌ర్!

By:  Tupaki Desk   |   25 Oct 2019 7:05 AM GMT
బిగ్ బీని వెంటాడుతోన్న క్రియేటివ్ డైరెక్ట‌ర్!
X
క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ స‌క్సెస్ చ‌వి చూసి కొన్ని సంవ‌త్స‌రాలైంది. ఎంతో ఎఫర్ట్ పెట్టి చేసిన 'గోవిందుడు అంద‌రివాడేలే'- 'న‌క్ష‌త్రం' ఫ‌లితాలు తీవ్ర నిరుత్సాహాన్నే మిగిల్చాయి. రెండేళ్ల నుంచి ఖాళీగానే ఉన్నాడు. రాసిన స్క్రిప్టులేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. దానికి తోడు బాల‌య్య 'రైతు' సినిమా చేస్తాన‌ని మాటిచ్చినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌ట్టాలెక్కే అవ‌కాశం లేదు. అందుకే ఇక‌ లాభం లేద‌నుకున్న కృష్ణ‌వంశీ త‌న క్రియేటివిటీని ప‌క్క‌న బెట్టి రీమేక్ వైపు దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. మ‌రాఠీ క్లాసిక్ హిట్టు 'న‌ట సామ్రాట్' పై ఆయ‌న క‌న్ను ప‌డింది.

'రంగ‌మార్తాండ' టైటిల్ తో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రీమేక్ రూపంలో తీసుకొస్తున్నాడు. ఇందులో ప్ర‌కాశ్ రాజ్- ర‌మ్య‌కృష్ణ జంట‌గా న‌టిస్తున్నారు. టైటిల్ లోగోను కూడా ఇటీవ‌లే రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేసారు. ఇలాంటి జోన‌ర్ ను రీమేక్ రూపంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ టాలీవుడ్ డైరెక్ట‌ర్ టచ్ చేయ‌లేదు. దీంతో కాస్త సాహ‌స‌మే అయిన‌ప్ప‌టికీ క్రియేటివ్ డైరెక్ట‌ర్ బుర్ర‌కు ప‌దునుపెట్టి రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నేష‌న‌ల్ లెవ‌ల్లో గుర్తింపు తీసుకొచ్చే ప్ర‌క్రియ కూడా ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ని రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇందులోనూ బిగ్ బీకి గురువు పాత్ర‌కే ఆఫ‌ర్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

అయితే ఈ ప్ర‌చారంలో నిజం ఎంత అన్న‌ది తేలాల్సి ఉంది. బిగ్ బీ సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో చిరంజీవికి గురువు పాత్ర‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అమితాబ్ ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోయినా చిరుతో త‌న‌కున్న బాండింగ్ కార‌ణంగా ఆఫ‌ర్ ని కాద‌న‌లేక ఎలాంటి పారితోషికం తీసుకుకోండా న‌టించారు. గోసారి వెంక‌న్న‌గా ఆయ‌న పాత్ర‌కు మంచి పేరొచ్చింది. ఇటీవ‌ల కాలంలో బిగ్ బీ ఆరోగ్యం అంతంత మాత్ర‌మే. కానీ చిరు కోసం అంగీక‌రించారు. ఇక‌ గ‌తంలో 'రైతు' సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం బాల‌కృష్ణ‌-కృష్ణ‌వంశీ అమితాబ్ ని ముంబాయి వెళ్లి క‌లిసారు. కానీ ఆఫర్ ను బిగ్ బీ సున్నితంగా తిర‌స్క‌రించారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి కృష్ణ వంశీ కి బిగ్ బీ ఎస్ చెబుతారా? నో అంటారా? లేక ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ నా? అన్న‌ది తేలాలి.