Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్‌ ప్రకటించకుండానే రికార్డులు మోత

By:  Tupaki Desk   |   11 July 2021 3:30 AM GMT
రిలీజ్ డేట్‌ ప్రకటించకుండానే రికార్డులు మోత
X
తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కు ఉన్న స్టార్‌ డమ్‌ మరియు క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆయన తమిళంలోనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా అభిమానంను దక్కించుకున్నాడు. అద్బుతమైన రికార్డును దక్కించుకున్న ఆయన ప్రస్తుతం వాలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. కమర్షియల్‌ సినిమాలకు పెట్టింది పేరు అయిన హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌ నిర్మించిన ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదలకు సిద్దం అవుతుంది. ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుంది అనే విషయం లో క్లారిటీ లేదు. కాని ఇప్పటికే బిజినెస్ పూర్తి అయ్యింది. గతంలో ఎప్పుడు అజిత్ కెరీర్ లో జరగనట్లుగా ఏకంగా 200 కోట్లకు మించి బిజినెస్‌ అయ్యిందని అంటున్నారు.

200 కోట్ల బిజినెస్‌ అనేది రికార్డ్‌ అంటూ తమిళ మీడియా వర్గాల వారు కూడా అంటున్నారు. అజిత్ సినిమా అంటే అక్కడ ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమా పై ఎంత మంది ఆసక్తిగా ఉన్నారనే సర్వేను ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ యాప్‌ బుక్ మై షో నిర్వహించింది. ఆ సమయంలో అతి తక్కువ సమయంలో ఏకంగా 1.7 మిలియన్‌ మంది ఇంట్రెస్ట్‌ చూపించారు. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ వారు ఎంతో ఆసక్తిగా ఉన్నామంటూ ముక్త కంఠంతో చెప్పారు.

ఈ స్థాయిలో ఇంట్రెస్ట్‌ లు బాహుబలి మరియు అవెంజర్స్ ఎండ్‌ గేమ్‌ కు కూడా రాలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ రెండు సినిమాల రికార్డును బ్రేక్‌ చేసేలా ఈ సినిమా కు ఇంట్రెస్ట్‌ లు దక్కాయి అంటే వసూళ్ల పరంగా మొదటి రెండు మూడు రోజులు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అద్బుతం ఆవిష్కరించేందుకు గాను మేకర్స్‌ సిద్దంగా ఉన్నామంటూ చెబుతున్నారు. కనుక సినిమా ఖచ్చితంగా మరో రేంజ్‌ లో ఉంటుందని అంటున్నారు.