Begin typing your search above and press return to search.

'శంకర్ - చరణ్' ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్స్..!

By:  Tupaki Desk   |   29 April 2021 3:30 AM GMT
శంకర్ - చరణ్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్స్..!
X
క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే డైలీ వార్తల్లో నిలుస్తోంది. 'RC15' సినిమా నేపథ్యం, సాంకేతిక నిపుణులు, హీరోయిన్, ఇతర నటీనటులు తదితర అంశాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

'RC15' శంకర్ తరహాలో సందేశాత్మక అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. 'భారతీయుడు' 'ఒకే ఒక్కడు' 'శివాజీ' వంటి సినిమాల మాదిరిగా భారీ స్థాయిలో రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో రాంచరణ్‌ పవర్‌ ఫుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. దీని కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ రాయడం కోసం రైటర్ వివేక్‌ ను తీసుకున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వివేక్ ఇంతకముందు 'అదిరింది' 'విజిల్' 'దర్బార్' 'ఇంకొక్కడు' 'ఆకాశం నీ హద్దురా' 'జగమే తంత్రం' వంటి తమిళ సినిమాలకు వర్క్ చేశారు. ఈ క్రమంలో 'శంకర్ - చరణ్' సినిమాకు వివేక్ డైలాగ్స్ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారని టాక్ నడుస్తోంది.

అలానే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ ని ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద భారీ క్యాస్టింగ్ తో భారీ వీఎఫ్ఎక్స్, ఇతర సాంకేతికతతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు శంకర్ - చరణ్ - దిల్ రాజు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను జూలై లేదా ఆగస్టు నెలలో సెట్స్‌ పైకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. 'RC15' చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.