Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాలో శిల్పాశెట్టి రోల్ పై క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   26 May 2021 12:30 AM GMT
మహేష్ సినిమాలో శిల్పాశెట్టి రోల్ పై క్రేజీ అప్డేట్..!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో ఇదివరకే అతడు - ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేకపోయాయి. కానీ ప్రేక్షకులు - విమర్శలకుల నుండి మాత్రం ప్రశంసలు అందుకున్నాయి. గతేడాది త్రివిక్రమ్ అలవైకుంఠపురంలో సినిమాతో.. అటు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలు హిట్స్ అందుకున్నారు. ఇద్దరూ కూడా సూపర్ సక్సెస్ లో ఉండేసరికి వీరి కాంబినేషన్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎందుకంటే త్రివిక్రమ్ - మహేష్ కాంబో వెండితెర పై హిట్ కాకపోయినా ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

దాదాపు 11ఏళ్ల తర్వాత వీరి కాంబోలో మరో సినిమా ప్రకటించే సరికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. అయితే ఇదివరకు చెప్పినట్లుగా ఈ సినిమాతో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వనుందని టాక్ నడుస్తుంది. నిజానికి డైరెక్టర్ త్రివిక్రమ్ తన ప్రతి సినిమాతో ఓ గతంలో హీరోయిన్స్ గా మెప్పించిన వారిని ఒక్కొక్కరుగా తీసుకొస్తుంటాడు. అత్తారింటికి దారేదితో సీనియర్ యాక్ట్రెస్ నదియాను పరిచయం చేసిన త్రివిక్రమ్.. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తిలో స్నేహ - అజ్ఞాతవాసిలో ఖుష్బు - అల వైకుంఠపురంలో సినిమాలో టబు.. ఇలా ఒక్కో సినిమాలో ఒక స్పెషల్ రోల్ ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు అదేవిధంగా మహేష్ బాబు సినిమాకోసం శిల్పాశెట్టిని సంప్రదించినట్లు సమాచారం.

మరి ఈ సినిమాలో శిల్పాశెట్టి ఇంకా కన్ఫర్మ్ అయిందో లేదో గాని అప్పుడే ఆమె చేయబోయే క్యారెక్టర్స్ ఇవే అంటూ కొన్ని రూమర్స్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలో శిల్పాశెట్టి మహేష్ బాబుకు మదర్ క్యారెక్టర్ అని వార్తలొచ్చాయి. కానీ మహేష్ కు శిల్పా మదర్ గా సెట్ కాదని.. ఇప్పుడు అక్క - వదిన - పిన్ని క్యారెక్టర్ అంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అక్క వదినగా కూడా మహేష్ పక్కన సెట్ అవుతుందో లేదో అని దాదాపుగా పిన్ని క్యారెక్టర్ ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇదే నిజమైతే శిల్పా రీఎంట్రీ గురించి టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు తెలుగులో హీరోయిన్ గా మెప్పించిందని చెబుతున్నారు. చూడాలి మరి మేకర్స్ ఫైనల్ కబురు ఏం చెబుతారో. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున సినిమా టైటిల్ తో పాటు యాక్టర్స్ పై క్లారిటీ రానుందని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు.