Begin typing your search above and press return to search.
'RC15' పై క్రేజీ అప్డేట్..!
By: Tupaki Desk | 7 July 2021 9:00 AM ISTస్టార్ డైరెక్టర్ శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దక్షిణాది అగ్ర దర్శకుడితో చరణ్ 15వ సినిమా సెట్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇది శంకర్ తరహాలో సందేశాత్మక అంశాలతో కమర్షియల్ హంగులు జోడించి రూపొందిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ సెంటర్ ఆడియన్స్ ని మెప్పించేలా సినిమాలు తీస్తూ వస్తున్న శంకర్.. ఈసారి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేయనున్నారట. చరణ్ ను సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేయడంతో పాటుగా అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరి '#RC15' ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో చూడాలి.
ఇకపోతే 'ఇండియన్ 2' వివాదంలో శంకర్ కు ఊరట లభించడంతో వీలైనంత త్వరగా 'RC15' ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చరణ్ - దిల్ రాజు చెన్నై వెళ్లి శంకర్ దీని గురించి చర్చించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో 'శంకర్-చరణ్' ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ ఆగస్టులో పూర్తవుతుంది. ఈ క్రమంలో RC15 స్క్రిప్ట్ రీడింగ్ - వర్క్ షాప్ వంటి వాటికోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నారట. అందుకే సెప్టెంబర్ లో సినిమా ప్రారంభిస్తారని అంటున్నారు.
అలానే తన సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకునే డైరెక్టర్ శంకర్.. చరణ్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయనున్నారట. నిరవధికంగా చిత్రీకరణ జరిపి వచ్చే ఏడాది సమ్మర్ నాటికి RC15 సినిమాని రెడీ చేయాలని భావిస్తున్నారట. ఇక క్యాస్టింగ్ పనులు కూడా చూసుకుంటున్న మేకర్స్ చరణ్ కు జోడీగా కియరా అద్వానీ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలానే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ లేదా ఎస్.ఎస్ థమన్ లలో ఒకరిని ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు. వీటిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.