Begin typing your search above and press return to search.

నితిన్ రీమేక్ మూవీపై క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ అదేనా..??

By:  Tupaki Desk   |   3 March 2021 8:30 AM GMT
నితిన్ రీమేక్ మూవీపై క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ అదేనా..??
X
ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల హవా బాగానే నడుస్తుంది. ఇప్పటికే తమిళ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల నుండి పలు సినిమాలు రూపొందుతున్నాయి. అదేకోవలో హీరో నితిన్ సినిమా కూడా తెరకెక్కుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ అవార్డు విన్నింగ్ మూవీ 'అంధాధున్‌' సినిమాను నితిన్‌ ప్రధాన పాత్రలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్సప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ పాత్రలో నభానటేష్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందట. అలాగే వీరిద్దరూ రొమాంటిక్ సన్నివేశాలలో చాలా లీనమై నటించినట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ సినిమాలో కీలకమైన టబు క్యారెక్టర్ ఎవరు పోషిస్తారనే ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారు మేకర్స్. నిజానికి ఒరిజినల్‌ వర్షన్‌లో నటించిన టబు పాత్రకోసం మొదట ఆమెనే సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పింది. ఆ తరువాత మరో ఇద్దరు హీరోయిన్లను కూడా అడిగితే వారు కూడా నో అనే చెప్పేశారట. కాస్త నెగటివ్ టచ్ ఉన్న రొమాంటిక్ క్యారెక్టర్ అది. మొత్తానికి ఈ బోల్డ్ క్యారెక్టర్ లో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. ఆ పాత్రకోసం తమన్నా సుమారు కోటిన్నర వరకు పారితోషికం తీసుకుందని ఇండస్ట్రీవర్గాలలో టాక్. అయితే ఇంకా తెలుగు వెర్షన్ టైటిల్ ఖరారు కానీ ఈ సస్పెన్సు థ్రిల్లర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టాక్. ఈ సినిమాలో నితిన్ బ్లైండ్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవలే చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ మార్చ్ 26న రంగ్ దే సినిమాతో రాబోతున్నాడు.