Begin typing your search above and press return to search.

'మహా సముద్రం' పై క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   17 May 2021 12:15 PM IST
మహా సముద్రం పై క్రేజీ అప్డేట్..!
X
'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''మహా సముద్రం''. ఇందులో వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ - 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా వైజాగ్ నేపథ్యంలో నడిచే ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

ఇకపోతే 'మహా సముద్రం' సినిమా చిన్నతనం నుంచే ఒకరిపై ఒకరు ద్వేషంతో రగిలిపోయే ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే క్రైమ్ డ్రామా అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇందులో ఇంటెన్స్ లవ్ స్టొరీ కూడా ఉందని.. సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర చనిపోతుందని అంటున్నారు. శర్వానంద్ - సిద్ధార్ద్ ఇద్దరూ ఇప్పటి వరకు నటించని బలమైన పాత్రల్లో కనిపించనున్నారని.. వీరిద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్సెలను డైరెక్టర్ అజయ్ భూపతి అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా రూపొందిస్తున్నారని సమాచారం.

కాగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ భారీ మల్టీస్టారర్ ను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. 'మహా సముద్రం' చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ 19న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.