Begin typing your search above and press return to search.

'లోకేష్ - కమల్' మూవీపై క్రేజీ అప్డేట్!

By:  Tupaki Desk   |   2 March 2021 11:30 AM GMT
లోకేష్ - కమల్ మూవీపై క్రేజీ అప్డేట్!
X
యువదర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కోలీవుడ్ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టరుగా మారాడు. మూడు సినిమాలే తీసాడు కానీ బాక్సాఫీస్ వద్ద అవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. అందుకే ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. లోకేష్ మేకింగ్ స్టైల్ నచ్చి స్టార్ హీరోలే ఛాన్స్ ఇస్తున్నారట. నగరం సినిమాతో డైరెక్టరైన లోకేష్.. ఖైదీ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసి వందకోట్ల క్లబ్ లో చేరాడు. ఈ ఏడాది మాస్టర్ సినిమాతో మరో సంచలనం సృష్టించాడు లోకేష్. దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ రెండు వందల కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పుడు నాలుగవ సినిమా 'విక్రమ్'ను లోకనాయకుడు కమల్ హాసన్ తో చేస్తున్నాడు.

థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిలిపేశారు. ఎందుకంటే కమల్ ఆల్రెడీ విరామంలో ఉన్నాడు. మే నెలలో తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎలక్షన్స్ తర్వాత విక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇదిలా ఉండగా.. లోకేష్ ప్రస్తుతం విక్రమ్ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ చేసాడట. గతేడాదే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి ట్రీట్ ఇచ్చాడు. ఆ టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా విక్రమ్ మూవీ యూట్యూబ్ లో ఇరవై మిలయన్ల మార్క్ దాటటంతో ఫిల్మ్ మేకర్స్ తమ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా విక్రమ్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని సమాచారం. అంతేగాక ఈ సినిమాలో ప్రభుదేవా కూడా కీలకపాత్రలో కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్. మలయాళ హీరో ఫాహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నాడట. అయితే చివరిగా కమల్ విశ్వరూపం-2లో కనిపించాడు. విక్రమ్ తో పాటు ఇండియన్-2లో కూడా నటిస్తున్నాడు.