Begin typing your search above and press return to search.

'విక్రమ్'లో ఫాహద్ క్యారెక్టర్ పై క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   21 May 2021 9:00 PM IST
విక్రమ్లో ఫాహద్ క్యారెక్టర్ పై క్రేజీ అప్డేట్..!
X
రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'మాస్టర్' ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో 'విక్రమ్' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్.. ఇప్పుడు ఈ మోస్ట్ అవెయిటింగ్ థ్రిల్లర్ బొనంజా సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కమల్ కెరీర్లో 232వది కావడం విశేషం. అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించి టీజర్ విడుదలై సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అసలు కమల్ హాసన్ లుక్ ఎలా ఉండబోతుందని వెయిట్ చేస్తున్న సమయంలో లోకేష్ టీజర్ వదిలి సర్ప్రైజ్ చేసాడు. టీజర్ చూస్తేనే సినిమా పై ఆసక్తి పెరిగిందంటే మరి ట్రైలర్ వచ్చే టైంకి ప్రేక్షకులు ఇంటరెస్ట్ పీక్స్ లోకి వెళ్తుందేమో.

అందులోను వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్న డైరెక్టర్ లోకేష్ సినిమా కాబట్టి సినిమా పై అంచనాలు మినిమం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. అయితే మొన్నటివరకు తమిళనాడులో సార్వత్రిక ఎన్నికల కారణంగా సినిమా ఆలస్యం అయింది. ఎన్నికలు ముగిసిన వెంటనే కమల్ విక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడని తెలిపారు. కానీ ఇంతలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వచ్చి పరిస్థితిని తారుమారు చేసింది. అయితే ప్రస్తుతం 'విక్రమ్' సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పోషించనుండగా.. మరో క్రేజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మలయాళం స్టార్ ఫాహద్ ఫాజిల్ నటించనున్నాడు.

ఇప్పుడు ఫాహద్ క్యారెక్టర్ పై పలు కథనాలు చెబుతున్నది ఏంటంటే.. ఈ సినిమాలో ఫాహద్ ఓ అవినీతి పోలీస్ గా కనిపించనున్నాడని టాక్. అంతేగాక విలన్ అయినటువంటి విజయ్ సేతుపతికి సహకరిస్తూ ఉంటాడని.. అదికూడా ఓ సాక్షి(ఆంథోనీ వర్గీసే)ని చంపడానికి అంటూ చెబుతున్నాయి. అయితే ఆ సాక్షిని కాపాడే హీరో పాత్రలో విక్రమ్ గా కమల్ హాసన్ నటిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో.. సినీవర్గాలలో హల్చల్ చేస్తోంది. అయితే సినిమా ప్రధానంగా ఈ నాలుగు క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుందని టాక్. మరి ఇప్పటికే అంచనాలు పెంచేసిన విక్రమ్ మూవీని రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. జల్లికట్టు ఫేమ్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు.