Begin typing your search above and press return to search.

బింబిసార సీక్వెల్స్ పై క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   29 Jun 2021 7:30 AM GMT
బింబిసార సీక్వెల్స్ పై క్రేజీ అప్డేట్..!
X
ప్రస్తుతం సక్సెస్ బాటలో లేని నందమూరి హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరు. గతంలో పటాస్, 118 సినిమాలతో హిట్స్ పడినప్పటికి.. ఆ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కళ్యాణ్ రామ్ చివరిగా 'ఎంత మంచివాడవురా' చిత్రంలో కనిపించాడు. అయితే ప్రస్తుతం ఈ నందమూరి హీరో ఖచ్చితంగా హిట్టు కొట్టాలనే కసిలో ఉన్నాడు. అందుకోసం ఈ లాక్డౌన్ లో పలు స్టోరీ లైన్స్ విని నచ్చిన సినిమాలను లైనప్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఇకపై తదుపరి సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇటీవలే రాజేంద్ర అనే డెబ్యూ డైరెక్టర్ స్టోరీని ఓకే చేసాడు కళ్యాణ్ రామ్.

ఆ చిత్రంలో కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపిస్తాడని టాక్. కళ్యాణ్ రామ్ ఇదివరకు డ్యూయెల్ రోల్ చేసాడు కానీ త్రిపాత్రభినయం ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది. ఆ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా.. రెండేళ్లు ముందే కళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ కథను ఓకే చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అందులో భాగంగానే ఈ సోషియో ఫాంటసీ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. నూతన దర్శకుడు వశిష్ట్ చెప్పిన స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా ఉందని.. కేవలం సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అయిందని సమాచారం.

అయితే ఈ సోషియో ఫాంటసీ చిత్రం టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కనుండగా 'బింబిసార' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూస్తే కళ్యాణ్ రామ్ బింబిసార అనే కింగ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. బాహుబలి మాదిరి యుద్ధం నేపథ్యంలో సినిమా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ బింబిసారలో కళ్యాణ్ రామ్ నెవర్ బిఫోర్ లుక్కులో దర్శనమిచ్చాడు. ఇటీవలే ఈ సినిమా గురించి పలు పుకార్లు వైరల్ అయ్యాయి. బింబిసార 3 పార్ట్స్ అని.. కొన్ని 2 పార్ట్స్ గా రాబోతుందని కథనాలు తెలిపాయి. కానీ తాజాగా ఈ చిత్రం కేవలం ఒకే పార్ట్ ఉంటుందని సీక్వెల్స్ ఉండవని వినికిడి. అలాగే సినిమా పూర్తిగా పీరియడిక్ నేపథ్యంలో ఉండదని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ పది రోజులు మాత్రమే మిగిలి ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతోంది.