Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్-5' పై క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   8 May 2021 8:30 AM GMT
బిగ్ బాస్-5 పై క్రేజీ అప్డేట్..!
X
తెలుగు బుల్లితెర పై వినోదం పంచే బిగ్ బాస్ రియాలిటీ షోకు క్రేజ్ మాములుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో క్రమం తప్పకుండా చూసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నారు. ఎలాగంటే బిగ్ బాస్ వీక్లీ ఓసారి రిపీట్ చేసుకొని చూసేవారు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరిని పక్కనపెడితే షో చూడకపోయినా వీక్లీ ఎవరు ఎలిమినేట్ అయ్యారని కనుక్కుంటూ ఉండేవారు రెండోరకం. అలా కూడా ఉన్నారా అనే సందేహం కలగొచ్చు.. కానీ ఆ కోవకు చెందిన లిస్ట్ కూడా బాగానే ఉంది. అంటే సమయాన్ని బట్టి వారికి.. లేదా పనిలో నిమగ్నమై ఉండటం.. లాంటివి కారణాలతో అలా చూస్తుంటారు. అయితే త్వరలోనే బిగ్ బాస్ 5వ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుందని ఇదివరకే స్టార్ మా యాజమాన్యం తెలిపింది. చూస్తుంటే నిజంగానే ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారా అనిపిస్తుంది. కానీ అవేం సందేహాలు అక్కర్లేదని టాక్.

ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ మొదలై విజయవంతంగా నాలుగు సీజన్లు సక్సెస్ అందుకుంది. ఈ రియాలిటీ షోను మొదటగా ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సెకండ్ సీజన్ నాని హోస్ట్ చేసాడు. అనంతరం అక్కినేని నాగ్ లైన్ లోకి వచ్చాడు. ఇప్పుడు 5వ సీజన్ కూడా ఆయనే హోస్ట్. అయితే ఈ 5వ సీజన్ కోసం టీవీ జనాలు ఎప్పటినుందో ఎదురు చూస్తున్నారు. మధ్యలో కరోనా రావడంతో ఆల్ ప్రోగ్రాంస్ టైమింగ్స్ మారిపోయాయి. త్వరలోనే బిగ్ బాస్ మొదలవుతుంది అనేసరికి ఫ్యాన్స్ లో కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి మొదలైంది. ఆ మధ్యలో బిగ్ బాస్ 5వ సీసన్ లో మీడియం స్టార్ లను దింపనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మోస్ట్ అవెయిటింగ్ బిగ్ బాస్.. ఈ ఏడాది ఆగష్టులో ప్రారంభం కాబోతుందని సమాచారం. అయితే ఈసారి యూట్యూబ్ స్టార్స్ - ఇంస్టాగ్రామ్ స్టార్స్ కూడా వస్తారనే తెలుస్తుంది. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ 4వ సీజన్ ఫాలో కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ సీసన్ అసలు డేట్ ఎప్పుడు రాబోతుందా..!