Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 'ప్రాజెక్ట్ కె' నుంచి క్రేజీ అప్ డేట్

By:  Tupaki Desk   |   31 Dec 2022 8:12 AM GMT
ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె నుంచి క్రేజీ అప్ డేట్
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్నారు. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో 'స‌లార్‌' మూవీ, ఓం రౌత్ తో 'ఆది పురుష్‌', మారుతి తో హార‌ర్ థ్రిల్ల‌ర్ 'రాజా డీల‌క్స్‌' వంటి మూవీస్ లో న‌టిస్తున్న ప్ర‌భాస్ ఇదే స‌మ‌యంలో 'మ‌హాన‌టి' ఫూమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె'లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్ర‌భాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నా ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి మాత్రం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న 'ప్రాజెక్ట్ కె' పైనే వుంది.

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ అత్యంత భారీ స్థాయిలో దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ కొత్త ప్ర‌పంచాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇందు కోసం భారీ వెహికిల్స్ ని కూడా సిద్ధం చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఇందు కోసం ప్ర‌ముఖ ఆటో మొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా గ్రూప్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా భారీ వాహ‌నాల‌ని రెడీ చేయ‌డం మొద‌లుపెట్టారు.

ఈ ఇష‌యాన్ని వెల్ల‌డిస్తూ తాజాగా శ‌నివారం చిత్ర బృందం ఓ వీడియోని విడుద‌ల చేసింది. ఈ మూవీకి సంబంధించిన కీల‌క వెహికిల్స్ ని సిద్దం చేసుకోవ‌డం కోసం ప్ర‌త్యేకంగా ఓ గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సినిమాకు సంబంధించిన వెహికిల్స్ త‌యారిని మొద‌లు పెట్టారు. ముందుగా ఓ వీల్ ని రెడీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ సినిమా కోసం ప్ర‌తీదీ త‌యారు చేసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చెబుతున్న మాట‌ల‌తో వీడియో మొద‌లైంది.

'ప్రాజెక్ట్ కె' ఎలా వుండ‌బోతోంద‌ని ఓ వ్య‌క్తి అడిగితే.. డెఫినెట్ లీ కొత్త సినిమా అండి ఇది. ఈ సినిమా ఎలా చేయాలో అన‌డానికి చాలా ట‌మ్ ప‌డుతోంది. అన్నీ త‌యారు చేయాలి. స్క్రాజ్ నుంచి అన్నీ తయారు చేయాలి. అని తెలిపాడు నాగ్ అశ్విన్.

ఇదే క్ర‌మంలో సినిమా కోసం తొలి వీల్ ని ఎలా సిద్ధం చేశారో వీడియోలో చూపించారు. సెట్ లో స‌భ్యులు ఒక్క టైర్ కోసం ప‌డుతున్న శ్ర‌మ‌ని చూపిస్తూనే టీమ్ ఒక్క టైర్ కోసం ఎంతో ఓవ‌ర్ చేస్తున్నార‌ని నాగ్ అశ్విన్ పంచ్ లు కూడా వేయించ‌డం గ‌మ‌నార్హం.

ఫైన‌ల్ గా టీమ్ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ వీల్ ని రెడీ చేసేసింది. టీమ్ టైర్ రెడీ చేస్తున్న టైమ్ లో సెటైర్లు వేయ‌డం చూస్తుంటే నాగ్ అశ్విన్ త‌న‌పై తానే సెటైర్లు వేసుకుని సోష‌ల్ మీడియాకు అవ‌కాశం ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డిన‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ‌త కొన్ని రోజులుగా కొత్త ప్ర‌పంచానికి సంబందించిన వెహికిల్స్ సృష్టించే ప‌నిలో వున్న నాగ్ అశ్విన్ ఈ మూవీని ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో తెర‌పైకి తీసుకురాబోతున్నాడ‌ట. ఇందులో అమితాబ్ బచ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీలో దీపికా ప‌దుకోనె, దిషా ప‌టానీ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.