Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ 'వీరమల్లు' నుండి క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   14 April 2021 6:00 PM IST
పవర్ స్టార్ వీరమల్లు నుండి క్రేజీ అప్డేట్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవన్.. తదుపరి 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై సినిమా పై అంచనాలు పెంచేసాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి వీరమల్లు సినిమా గురించి ఏ చిన్న వార్త వినిపించినా అభిమానులకు పండగే అవుతుంది. పవర్ స్టార్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న వీరమల్లు సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ చేస్తున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్ ఏయం.రత్నం వీరమల్లు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అయితే తాజాగా వీరమల్లు సినిమా కథ గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మొఘలుల కాలంనాటి సామ్రాజ్యంలో వీరమల్లు అనే బందిపోటు కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇంగ్లీష్ సినిమాలో లాగా ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ ధనికులను దోచి పేదలకు పంచే కాన్సెప్ట్ తో పాటు పలు సామాజిక అంశాలను కూడా ఈ సినిమాలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. పీరియడిక్ చిత్రం కావడంతో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఫస్ట్ పీరియడిక్ మూవీ ఇది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ హిస్టారికల్ మూవీ కాబట్టి చరిత్రలో నిలిచిపోయే సినిమాగా ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.