Begin typing your search above and press return to search.

మెగాస్టార్ షూట్ నుండి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కి పండగేనట!

By:  Tupaki Desk   |   4 March 2021 8:33 AM GMT
మెగాస్టార్ షూట్ నుండి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కి పండగేనట!
X
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. రోజురోజుకి భారీ అంచనాలు పెంచుతున్న ఈ సినిమా నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుండి మెగాఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆచార్య సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రాంచరణ్ ఓ కీలకపాత్ర పోషించడం. ఎందుకంటే ఇదివరకు పలు సినిమాలలో ఇద్దరూ మెరిసారు కానీ పెద్దగా సన్నివేశాలు మాత్రం ఉండవు. కానీ ఈ సినిమాలో రాంచరణ్ ఓ ఫుల్ లెన్త్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. అందుకే సినిమాపై అంచనాలు డబుల్ అయిపోయాయి.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో రాంచరణ్, మెగాస్టార్ కలిసి దిగిన ఓ పిక్ ఫుల్ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ ఫోటోలో చిరు, చరణ్ ఇద్దరూ కూడా ఒకేరకం డ్రెస్సింగ్ స్టైల్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి అడవిప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతుంది. అలాగే ఈ సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ కూడా కొత్తగా వినిపిస్తుంది. అదేంటంటే.. మెగాస్టార్, రాంచరణ్ ఇద్దరూ కూడా విడివిడిగా పాటల్లో డాన్స్ చేయడం చూసాం. కానీ ఈ సినిమా ఇద్దరినీ ఒకే సాంగ్ లో ఆడిపాడించి ట్రీట్ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడట డైరెక్టర్ కొరటాల. నిజంగా ఈ మెగాఫాదర్ సన్ ఒకే సాంగ్ లో స్టెప్స్ వేస్తే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్, రాంచరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనున్నారు. సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.