Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ స్టార్‌ 'మిస్టర్ ప్రెగ్నెంట్‌'

By:  Tupaki Desk   |   5 Sep 2021 5:46 AM GMT
బిగ్‌ బాస్‌ స్టార్‌ మిస్టర్ ప్రెగ్నెంట్‌
X
తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు ముగిశాయి. ఇప్పటి వరకు ఎంతో మంది బిగ్ బాస్ వల్ల మంచి పేరు దక్కించుకున్నారు. కాని సోహెల్‌ కు దక్కినంత గుర్తింపు మరెవ్వరికి రాలేదు అనడంలో సందేహం లేదు. ఎంతో మందికి సోషల్‌ మీడియాలో ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కింది. కాని బిగ్ బాస్ వల్ల సోహెల్‌ మాత్రం హీరోగా స్టార్‌ గా మారిపోయాడు అనడంలో సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జునల ప్రశంసలు దక్కించుకున్న సోహెల్‌ బ్యాక్‌ టు బ్యాక్ హీరోగా సినిమాలు కమిట్‌ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న సోహెల్‌ తాజాగా శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

సోహెల్‌ సినిమా అంటేనే సోషల్‌ మీడియాలో ప్రత్యేక సందడి ఉంటుంది. బిగ్‌ బాస్ విన్నర్‌ కాకున్నా కూడా విన్నర్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న సోహెల్‌ తాజా సినిమా కు మిస్టర్ ప్రెగ్నెంట్‌ అంటూ టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్‌ చాలా విభిన్నంగా ఉంది. భలే ఉందే.. కాన్సెప్ట్‌ ఏమై ఉంటుందో అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగేలా ఈ టైటిల్‌ ఉంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమాలో సోహెల్‌ ప్రెగ్నెంట్‌ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా విభిన్నమైన పాత్ర అతడిది అని పిల్లలు పెద్దలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ ఎంటర్ టైన్ చేస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. ప్రయోగాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా వినోదాన్ని కావాల్సినంత ఇస్తుంది అనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మైక్ సినిమా బ్యానర్‌ లో అన్నప్పరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సోహెల్‌ ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్ ను చూపిస్తుందనే నమ్మకం కలుగజేస్తుంది.