Begin typing your search above and press return to search.

'మాస్ రాజా - మెగాపవర్ స్టార్' కాంబోలో క్రేజీ రీమేక్..??

By:  Tupaki Desk   |   19 March 2021 6:00 AM GMT
మాస్ రాజా - మెగాపవర్ స్టార్ కాంబోలో క్రేజీ రీమేక్..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇకపై చాలా రీమేక్ సినిమాలు తెరమీదకు రానున్నాయి. అందులో ఒకటి మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా డ్రైవింగ్ లైసెన్స్. 2019 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. లాల్ జూనియర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి క్రేజ్ తో పాటు వసూళ్లు కూడా రాబట్టింది. ఈ మధ్య ఏ భాషలో సినిమా హిట్ అయినా వెంటనే ఇతర ఇండస్ట్రీల కళ్లు ఆ సినిమా పై పడిపోతాయి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిందో లేదో.. వెంటనే టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టి ఆ సినిమాపై పడింది. అలాగే తెలుగు అనువాద హక్కులను కూడా దక్కించుకున్నారు.

ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను స్టార్ హీరో రాంచరణ్ సొంతం చేసుకున్నాడు. ఓ హీరో తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకొనే ప్రాసెస్ లో జరిగే కథాంశం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మంచి కామెడీ అంశాలతో ఈ సినిమా హిట్ అయింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రాంచరణ్ రవితేజ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. రాంచరణ్ నిర్మించనున్న ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. మరి రవితేజ ఓకే అయితే గనక సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయినట్లే. ప్రస్తుతం మాస్ రాజా ఖిలాడి, డైరెక్టర్ త్రినాథరావు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి డ్రైవింగ్ లైసెన్స్ పై క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.