Begin typing your search above and press return to search.

తెలుగులో మిల్కీబ్యూటీ హోస్ట్ గా క్రేజీ రియాలిటీ షో..!

By:  Tupaki Desk   |   15 Jun 2021 5:00 PM IST
తెలుగులో మిల్కీబ్యూటీ హోస్ట్ గా క్రేజీ రియాలిటీ షో..!
X
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి రియాలిటీ షోలు ఇప్పుడు ఇండియాలో కూడా మొదలవుతున్నాయి. విదేశాల్లో సక్సెస్ అయిన రియాలిటీ గేమ్ షోలను ఇండియాలో ఇక్కడి నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసి కంటిన్యూ చేస్తున్నారు. అలా విదేశాల నుండి స్ఫూర్తి పొంది ఇండియాలో ప్రసారం చేస్తున్నవే 'కౌన్ బనేగా కరోడ్ పతి'(తెలుగులో మీలో ఎవరు కోటిశ్వరులు) - బిగ్ బాస్.. ఇవి ఆల్రెడీ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయినవే. కానీ ఇదివరకు హిందీ వరకే పరిమితం అయినటువంటి ఈ ప్రోగ్రాంస్ అన్ని ప్రస్తుతం ఒక్కొక్కటిగా లోకల్ లాంగ్వేజెస్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

తాజాగా మరో క్రేజీ రియాలిటీ గేమ్ షో తెలుగులో ప్రసారం కాబోతుంది. అదికూడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యిందే. అంతేగాక ముప్పై సంవత్సరాల నుండి వివిధ దేశాల్లో విజయవంతంగా రన్ అవుతోంది. అలాగే పదేళ్లుగా ఇండియాలో కొనసాగుతుంది. అదేంటంటే.. మాస్టర్ చెఫ్ ఇండియా. కానీ కేవలం స్టార్ ప్లస్ ఛానల్లో అదికూడా హిందీ భాషలో మాత్రమే. అయితే ఇప్పుడు ఈ మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగులో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు కూడా వేగవంతంగా జరుపుతున్నారు జెమినీ ఛానల్ యాజమాన్యం.

అయితే ఈ క్రేజీ కుకింగ్ గేమ్ షోను నడిపించేందుకు ఓ హోస్ట్ కావాలి కదా.. మొన్నటివరకు పలువురి పేర్లు వినిపించాయి. కానీ ఆఖరికి తెలుగు హోస్ట్ గా మాత్రం మిల్కీబ్యూటీ తమన్నా ఎంపిక అయినట్లు తెలుస్తుంది. ఈ మాస్టర్ చెఫ్ తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషల్లో కూడా ప్రారంభం అవుతోంది. కానీ వాటన్నిటికీ మేల్ హోస్ట్ సెలెక్ట్ కాగా తెలుగులో మాత్రం ఫిమేల్ బ్యూటీ తమన్నా సెలెక్ట్ అవ్వడంతో షో పై మరింత ఆసక్తి పెరుగుతోంది. వచ్చే నెలలోనే ఈ గేమ్ షో షూటింగ్ లో పాల్గొనబోతుంది అమ్మడు. ఆల్రెడీ షోకు సంబంధించి పార్టిసిపేట్స్ ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం తమన్నా నుండి సీటిమార్ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే మాస్ట్రో సినిమాలో బోల్డ్ రోల్ చేస్తోంది తమన్నా. చూడాలి మరి మిల్కీబ్యూటీ హోస్ట్ గా సక్సెస్ అవుతుందేమో!