Begin typing your search above and press return to search.

2021 ఎండింగులో `రేస్ 4` మొద‌లెడ‌తార‌ట‌

By:  Tupaki Desk   |   29 Jun 2021 7:00 AM IST
2021 ఎండింగులో `రేస్ 4` మొద‌లెడ‌తార‌ట‌
X
అడుగ‌డుగునా ఊహించ‌ని ట్విస్టులు.. ఎత్తుగ‌డ‌లు.. గేమ్స్ లో పాలిటిక్స్.. వీటికి తోడు అంద‌గ‌త్తెల వ‌య్యారాల వ‌డ్డ‌న‌లు య‌య్యాట‌లు.. వ‌గైరా వ‌గైరా గ్లిజ్ అండ్ గ్లామ్ తో దుమారం రేప‌డం రేస్ సిరీస్ ప్ర‌త్యేక‌త‌. ఇప్ప‌టికే ఈ సిరీస్ లో మూడు సినిమాలు రిలీజ‌వ్వ‌గా తొలి రెండూ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించాయి. మూడో భాగం ఆశించినంత హిట్ట‌వ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌నిపించింది.

ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో సినిమా ఏడాది చివ‌రి నాటికి రిలీజైపోతుంద‌న్న క‌బురు రేస్ ఫ్రాంఛైజీ అభిమానుల‌ను ఊరిస్తోంది. ఇన్నాళ్లు ఈ ఫ్రాంచైజీలో నాలుగో భాగం ఉందా లేదా? అనేది అస్పష్టంగా ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ పై ఇప్ప‌టికే ప‌ని జ‌రుగుతోంద‌ని తెలిసింది. అంతేకాదు.. సంవత్సరం చివరినాటికి దానిని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

రేస్ 4 ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉంది. షిరాజ్ అహ్మద్ మూడు భాగాల‌కు ర‌చ‌యిత‌గా పనిచేశారు. నాల్గవ భాగంలో కూడా పని చేస్తారు. నిర్మాత రమేష్ తౌరానీ త్వరలో దర్శకుడిని లాక్ చేస్తారని స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతే కాస్టింగ్ ఎంపిక ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా COVID-19 పరిస్థితిని బట్టి ప్లాన్ చేస్తారు. సంవత్సరం చివరినాటికి ప్రాజెక్టు మొద‌ల‌య్యేందుకు ఆస్కారం ఉంద‌ని భావిస్తున్నారు.

ప్రస్తుతానికి మొదటి రెండు చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ నాల్గవ విడతలో తన పాత్రను పునరావృతం చేస్తారా లేదా రేస్ 3 లో నటించిన సల్మాన్ ఖాన్ దీనిని ముందుకు తీసుకువెళతారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. మొదటి రెండు చిత్రాలకు అబ్బాస్-మస్తాన్ దర్శకత్వం వహించగా మూడవ భాగానికి రెమో డిసౌజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నాలుగో భాగానికి ఎవ‌రు ప‌ని చేస్తారు? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్.