Begin typing your search above and press return to search.

మాఫియా మోకాల‌డ్డినా కార్తీక్ ఆర్య‌న్ కి క్రేజీ ఆఫ‌ర్

By:  Tupaki Desk   |   24 Jun 2021 11:00 AM IST
మాఫియా మోకాల‌డ్డినా కార్తీక్ ఆర్య‌న్ కి క్రేజీ ఆఫ‌ర్
X
యువ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానంత‌ర ప‌రిణామాలు తెలిసిన‌దే. స‌క్సెస్ లో ఉన్న సుశాంత్ సింగ్ కెరీర్ ని నాశ‌నం చేసేందుకు ఒక సెక్ష‌న్ బాలీవుడ్ సినీపెద్ద‌లు మాఫియాగా ఏర్ప‌డి అత‌డికి ఛాన్సులు రాకుండా చేశార‌ని కంగ‌న వంటి స్టార్ ఆరోపించారు. చాలామంది సినీతార‌లు ఈ ఆరోప‌ణ‌ల్ని కొట్టి పారేయలేదు. బాలీవుడ్ లో మాఫియా పోక‌డ‌పై సోషల్ మీడియా డిబేట్ సంచ‌ల‌న‌మే అయ్యింది.

సుశాంత్ సింగ్ త‌ర‌హాలోనే ఇప్పుడు మ‌రో ప్ర‌తిభావంతుడు కార్తీక్ ఆర్యన్ పైనా కుట్ర జ‌రుగుతోంద‌న్న వాద‌న ఇటీవ‌ల తెర‌పైకొచ్చింది. దోస్తానా 2 నుంచి కార్తీక్ ఆర్య‌న్ ని ఆక‌స్మికంగా తొల‌గిస్తున్న‌ట్టు క‌ర‌ణ్ జోహార్ బృందాలు ప్ర‌క‌టించ‌డంతో ఇక‌పై కార్తీక్ కి అవ‌కాశాలు రావ‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అందుకు త‌గ్గ‌ట్టే ఇటీవ‌లే ఓ క్రేజీ మూవీ నుంచి కార్తీక్ ని తొల‌గించార‌ని ప్ర‌చార‌మైంది. మ‌రికొన్ని అవ‌కాశాల్ని అత‌డు కోల్పోయేందుకు ఆస్కారం ఉంద‌ని విశ్లేష‌ణ‌లు జోరందుకున్నాయి.

అయితే కార్తీక్ ఆర్య‌న్ ని న‌మ్మి సాజిద్ న‌డియావాలా లాంటి అగ్ర నిర్మాత ఓ అవ‌కాశం క‌ల్పించ‌డం తాజాగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కార్తీక్ క‌థానాయ‌కుడిగా `సత్యనారాయణ్‌ కి కథ` పేరుతో ఓ సినిమాని సాజిద్ ప్రకటించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సమీర్ విద్వాన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. నమా పిక్చర్స్ తో క‌లిసి సాజిద్ నడియావాలా బ్యానర్ నడియాద్ వాలా గ్రాండ్సన్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తుంది.

ఈ విష‌యాన్ని కార్తీక్ తన సోషల్ మీడియాల్లో వెల్ల‌డించారు. నా హృదయానికి దగ్గరగా ఉన్న కథ #సత్యనారాయణ్ కి క‌థ‌.. ప్రత్యేక వ్యక్తులతో కూడిన ప్రత్యేక చిత్రమిది.. అని తెలిపారు. కొంతకాలంగా సాజిద్ సార్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఇంత‌కంటే మంచి అవ‌కాశం మ‌రొక‌టి లేదు. సాజిద్ సర్.. షరీన్ .. కిషోర్ దృష్టిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సత్యనారాయణన్ కి కథ ఒక సంగీత ప్ర‌ధాన ప్రేమ‌క‌థా చిత్రం. జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్ర‌ముఖుల వ‌ల్ల మ‌రింత శక్తిని కలిగిస్తోంది. సున్నితమైన విషయాలను అత్యంత వినోదాత్మకంగా తీర్చిదిద్దడంలో స్పెష‌లిస్ట్ అయిన‌ సమీర్ విద్వాన్స్ తో ఇది నాకు మొదటి సినిమా`` అని తెలిపారు. జాతీయ అవార్డులు సాధించిన ప్ర‌ముఖుల‌ టీమ్ లో సభ్యుడిని కాబట్టి నేను చాలా బాధ్యతగా భావించి ప‌ని చేస్తున్నాను`` అని కార్తీక్ అన్నారు. చాలా ప్రతిభావంతుడైన కార్తీక్ ఆర్యన్ తో మొదటిసారి ప‌ని చేస్తున్నాం.. అతను ఈ ప్రాజెక్టుకు కొత్త శక్తిని తెస్తాడని సాజిద్ న‌డియావాలా అన్నారు.