Begin typing your search above and press return to search.

#క్రేజీ ఆఫ‌ర్‌.. నాని స‌ర‌స‌న స‌మంత‌?

By:  Tupaki Desk   |   31 Oct 2021 2:30 AM GMT
#క్రేజీ ఆఫ‌ర్‌.. నాని స‌ర‌స‌న స‌మంత‌?
X
తుఫాన్ ముందు సైలెన్స్ లా ఉంది స‌మంతలో అంత‌ర్మ‌ధ‌నం. అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సామ్ వ‌రుస విహార‌యాత్ర‌ల‌తో రిలాక్స్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఛార్ ధామ్ యాత్ర అనంత‌రం వెంట‌నే దుబాయ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఓవైపు విహార‌యాత్ర‌ల‌తో తీరిక లేకుండా ఉన్నా మ‌రోవైపు వ‌రుస‌గా స‌మంత నిర్మాత‌ల‌ నుంచి సినిమాల ప్ర‌క‌ట‌న‌లు ఆగ‌డం లేదు. ఇంత‌కుముందు త‌మిళ అగ్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ కి .. తెలుగు ప్ర‌ముఖ బ్యానర్ శ్రీ‌దేవి మూవీస్ కి సామ్ క‌మిటైన సంగ‌తి తెలిసిందే. ఆ రెండు సినిమాలు లాంచింగ్ ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈలోగానే మ‌రో సినిమాకి సమంత ఓకే చెప్పేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు.

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా ఇటీవ‌ల‌ `దసరా` అనే చిత్రాన్ని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే గ్రామీణ ప్రేమకథ. ఈ సినిమాతో శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రాజెక్ట్ పై తగినంత ఆస‌క్తిని పెంచింది. ఇప్పుడు ఇందులో స‌మంత‌ను క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌నున్నార‌ని తెలిసింది. స‌మంత ఇంత‌కుముందు నాని స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఆస‌క్తిని పెంచుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక‌పోతే విడాకుల అనంత‌రం స‌మంత టాలీవుడ్ వ‌దిలి వెళుతుంద‌నే పుకార్లకు సామ్ ప్రాక్టిక‌ల్ గానే చెక్ పెట్ట‌నుంది. తెలుగు నిర్మాత‌లు స‌మంత‌కు అవ‌కాశాలిచ్చేందుకు వెన‌కాడ‌డం లేద‌ని ప్రూవ్ అవుతోంది. అయితే నాని సినిమాకి స‌మంత ఇంకా సంత‌కం చేయాల్సి ఉంది. అధికారికంగా చిత్ర‌బృందం ప్ర‌క‌టిస్తుందేమో చూడాలి. నాని ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. శ్యామ్ సింఘ‌రాయ్ త‌ర్వాత అంటే సుంద‌రానికి అనే అర్బ‌న్ ల‌వ్ స్టోరి లో న‌టిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ద‌స‌రా సినిమాని ప్రారంభిస్తాడు