Begin typing your search above and press return to search.

`ఆదిపురుష్` రావ‌ణ్ కి సౌత్ రీమేక్ లో క్రేజీ ఆఫ‌ర్

By:  Tupaki Desk   |   26 Dec 2020 11:15 AM IST
`ఆదిపురుష్` రావ‌ణ్ కి సౌత్ రీమేక్ లో క్రేజీ ఆఫ‌ర్
X
డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆది పురుష్ 3డి` సినిమా వ‌ర్గాలు స‌హా అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి - సాహో లాంటి భారీ చిత్రాల త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి పాన్ ఇండియా సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తున్నార‌న్న ప్ర‌చారం వేడి పెంచింది. ఆదిపురుష్ లో ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావ‌ణ్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

తానాజీ 3డిలో క్రేజీ విల‌న్ గా న‌టించిన సైఫ్ కి ఆదిపురుష్ లోనూ విల‌నీ చేసే అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు మ‌రో స్టార్ హీరో హృతిక్ రోష‌న్ తో క‌లిసి ధీటైన పాత్ర‌లో న‌టించే అవ‌కాశాన్ని సైఫ్ ఖాన్ ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. వార్ లాంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన హృతిక్ ప్ర‌స్తుతం ఓ సౌత్ రీమేక్ లో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

విజయ్ సేతుపతి - ఆర్.మాధవన్ నటించిన విక్ర‌మ వేద రీమేక్ లో సైఫ్ అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ మూవీలో హృతిక్ రోష‌న్ మ్యాడీ సేతుప‌తి పోషించిన గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. సైఫ్ ఏకంగా మాధ‌వ‌న్ పోషించిన సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

ఒక తెలివిగల గ్యాంగ్ స్టర్ ని పోలీసులు పట్టుకున్న ప్రతిసారీ ఎలాగోలా తప్పించుకుంటాడు. తన జీవితం క‌థ‌ నుండి తీసిన కొత్త కథను వివరిస్తూ త‌ప్పించుకుంటాడు. ఇలాంటి ఆస‌క్తిక‌ర డ్రామాలో ఇద్ద‌రు పెద్ద స్టార్లు న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. నిజానికి ఈ మూవీలో హృతిక్ చేయాల్సిన పాత్ర‌లో అమీర్ ఖాన్ న‌టిస్తార‌న్న ప్ర‌చారం సాగినా ఆయ‌న మిడిల్ డ్రాప్ అయ్యారు. బాలీవుడ్ రీమేక్ ‌కు పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహించనున్నారు. నీరజ్ పాండే క్రియేటివ్ స‌పోర్ట్ తో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.