Begin typing your search above and press return to search.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’పై క్రేజీ న్యూస్.. ప్రకటించిన డైరెక్టర్

By:  Tupaki Desk   |   31 Dec 2020 12:06 PM IST
ప్రభాస్ ‘రాధేశ్యామ్’పై క్రేజీ న్యూస్.. ప్రకటించిన డైరెక్టర్
X
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. ఇప్పుడు లేటేస్ట్ గా ఆయన చేస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు వెయిట్ వేస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. దర్శకుడు రాధా కృష్ణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా.. వింటేజ్ వండర్ గా ప్లాన్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఆ మధ్య వచ్చిన మోషన్ పోస్టర్ టీజర్ అయితే మెస్మరైజింగ్ గా అనిపించింది. దీంతో.. ఈ మూవీపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

ఇక, టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో దర్శకుడు రాధా కృష్ణ ఓ లేటెస్ట్ న్యూస్ రివీల్ చేశాడు డైరెక్టర్. ఈ వచ్చే కొత్త సంవత్సరంలో ‘లవ్ అండ్ రొమాన్స్ కు వెల్కమ్ చెప్పండి’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో.. రాధేశ్యామ్ రిలీజ్ వచ్చే ఏడాదిలోనే అని ఇన్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్.

ఈ చిత్రం కేవలం లవ్ స్టోరీ గానే కాకుండా మంచి రొమాన్స్.. మంచి ఎమోషన్ మూవీగా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు దర్శకుడు పరోక్షంగా నెక్ట్స్ రాబోతోందని ప్రకటించడంతో అభిమానులు ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే.. కొత్త ఏడాదిలో ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది? ఆ డేట్ ఎప్పుడో ప్రకటిస్తారోని ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కాగా.. ప్రస్తుతానికైతే ఈ సినిమా పేరు, ప్రభాస్ పేరు నేషనల్ లెవల్లో ట్రెండ్ అవుతున్నాయి.