Begin typing your search above and press return to search.

ఫ్యాన్ వీరంగం.. భాయ్ దొరికాడో అయిపోయాడే..!

By:  Tupaki Desk   |   27 Feb 2022 5:00 PM IST
ఫ్యాన్ వీరంగం.. భాయ్ దొరికాడో అయిపోయాడే..!
X
అభిమానం హ‌ద్దు మీరితే ఎలా ఉంటుందో.. పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరుకుంటే ఏ రేంజులో ఉంటుందో ఇదిగో ఈ వీడియో ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. సినీ స్టార్ల‌కు ఉండే పిచ్చి ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రూఫ్ ఇది. ఇలాంటివి చాలాసార్లు చూసినా ఇది చాలా ప్ర‌త్యేకం. బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ భాయ్ కి ఉన్న మ‌హిళా ఫ్యాన్స్ ఏ రేంజులో ఉంటారో.. భాయ్ తో ఫాంట‌సీ లో ఎలా మునిగిపోతారో కూడా ఈ స‌న్నివేశం ప్ర‌త్య‌క్షంగా చూపిస్తోంది.

స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన సినిమాల‌కు దేశ విదేశాల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అత‌డికి వ‌ర‌ల్డ్ వైడ్ మ‌హిళా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ద‌బాంగ్ టూర్ లో క్రేజీ మహిళా అభిమాని తన ఛాతీపై `స‌ల్మాన్ టాటూ` వేయించుకుని వేదిక వ‌ద్ద చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. ఇది ప‌రాకాష్ట అంటూ జ‌నం బెంబేలెత్తేలా చెల‌రేగిపోయింది.

రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న భాయ్ కు భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంద‌నడానికి ఇలాంటి నిద‌ర్శ‌నాలెన్నో. అతను ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో తన బ‌ల‌గంతో టూర్ లో ఉన్నాడు. ఒక షోలో.. వెర్రి మహిళా అభిమాని స‌ల్మాన్ సెక్యూరిటీ గార్డులపైనే వీరంగ‌మాడింది. తనను వేదికపైకి అనుమతించమని వారిపై విరుచుకుప‌డింది. ఆవిడ ఎన‌ర్జీ లెవ‌ల్ కి సెక్యూరిటీ గార్డులు బిత్త‌ర‌పోతూ ఆపేందుకు ప్ర‌య‌త్నించారు.

ఆ మ‌హిళ‌తో ఉన్న స్నేహితురాలు ఆపేందుకు ప్ర‌య‌త్నించినా త‌న మాట విన‌లేదు. దీంతో ఆమె ఆచేత‌నంగా నిస్స‌హాయంగా చూస్తూ దూరంగా ఉండిపోయింది. సల్మాన్ పై ప్రేమగా తన ఛాతీపై వేయించుకున్న టాటూను ఆ మ‌హిళాభిమాని చూపిస్తోంది.

ఈ చిన్న వీడియో ఇంట‌ర్నెట్ లో వైరల్ గా మారింది. 55 ఏళ్ల వయస్సులో కూడా సల్లూ భాయ్ కు బలమైన మహిళా ఫాలోయింగ్ ఉందన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. అత‌డు బ్యాచిల‌ర్ షిప్ వ‌దిలేసి పెళ్లాడేస్తాను! అని ఒకే ఒక్క మాట అంటే చాలు.. కోట్లాది మంది అప్లికేష‌న్లు పెట్టుకోవడం గ్యారెంటీ.

అక్కడ భాయ్ ఇక్క‌డ ప్ర‌భాస్ దొందూ దొందే!

భాయ్ కంటే ప్ర‌భాస్ రేంజే ఎక్కువ‌ని ప్రూవ్డ్!
--
శాటిలైట్ డిజిట‌ల్ రైట్స్ కి 150కోట్ల ఆఫ‌ర్?

స‌ల్మాన్ భాయ్ త‌ర‌హాలోనే టాలీవుడ్ లో బ్యాచిల‌ర్ గా ఉన్న ఏకైక హీరో డార్లింగ్ ప్ర‌భాస్. అత‌డు పెళ్లి మాటెత్తితేనే ఆన్స‌రివ్వ‌డు. డార్లింగ్ పెళ్లి గురించి ఎంత చ‌ర్చ సాగినా సైలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఇక స‌ల్మాన్ త‌ర‌హాలోనే ప్ర‌భాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

అత‌డికి వ‌ర‌ల్డ్ వైడ్ వీరాభిమానులున్నార‌న‌డానికి ఇంత‌కుముందు అత‌డి ఇంటి ముందు విదేశీ వ‌నిత‌ల వీరంగ‌మే సాక్ష్యంగా నిలిచింది. జ‌పాన్ - చైనా స‌హా ప‌లు దేశాల్లో ప్ర‌భాస్ కి ఇప్పుడు మ‌హిళా ఫ్యాన్స్ ఉన్నారు. వీరంతా హైద‌రాబాద్ టూర్ కి వ‌చ్చి ప్ర‌భాస్ ఇంటిని చుట్టుముడితే ఏంటో ప‌రిస్థితి?

బాహుబ‌లి - సాహో త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగింది. అత‌డి బిజినెస్ రేంజుతో పాటు ఫాలోయింగ్ లో రేంజు అంతే ఇదిగా పెరిగింది.