Begin typing your search above and press return to search.

మంచు విష్ణు- వైట్ల క‌ల‌యిక‌లో క్రేజీ ఎంట‌ర్ టైన‌ర్

By:  Tupaki Desk   |   20 Nov 2020 11:00 AM IST
మంచు విష్ణు- వైట్ల క‌ల‌యిక‌లో క్రేజీ ఎంట‌ర్ టైన‌ర్
X
దర్శకుడు శ్రీను వైట్ల - మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన ' ఢీ ' సినిమా ఇంత చక్కటి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా తాను చక్కగా కామెడీ కూడా చేయగలనని మంచు విష్ణు నిరూపించుకున్నాడు. అంతేకాదు దర్శకుడు శ్రీను వైట్ల, హీరో విష్ణు కు ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోయింది. మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో గ్రాండ్ గా అడుగుపెట్టిన మంచు విష్ణు సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ తొలినాళ్లలో భారీ బడ్జెట్ తో, మంచి కాంబినేషన్లతో సినిమాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అలాంటి సమయంలో మంచు విష్ణు, శ్రీను వైట్లతో చేసిన 'ఢీ' సినిమా కెరీర్ లో అతడికి తొలి విజయాన్ని అందించింది.

అయితే విష్ణు ముందు నుంచి తాను నమ్ముకున్న మాస్ సినిమాల ద్వారా కాకుండా కామెడీ, యాక్షన్ సినిమా ద్వారా విజయాన్ని అందుకున్నాడు. 2007లో విడుదలైన ఈ సినిమా చక్కటి కామెడీ పండించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీను వైట్ల కూడా మెగాస్టార్ చిరంజీవి తో అందరివాడు సినిమా తీసి ప్లాప్ మూటగట్టుకోగా 'ఢీ' సినిమాతో ఫామ్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా శ్రీనువైట్ల రెడీ, దూకుడు వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు ఇచ్చాడు.

ఆ విధంగా 'ఢీ' సినిమా మంచు విష్ణు, శ్రీను వైట్ల కెరీర్లలో ఒక మలుపు గా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం మంచు విష్ణు వరుస వైఫల్యాలతో రేసులో వెనుకబడ్డాడు. శ్రీను వైట్లకు కూడా కొంత కాలంగా హిట్ సినిమా లేదు. దీంతో వీళ్లిద్దరూ మరోసారి జత కడుతున్నారు. శ్రీనువైట్ల -మంచు విష్ణు కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈనెల 23న 'ఢీ' సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రకటన చేయబోతున్నట్లు మంచు విష్ణు ట్వీట్ చేశారు. దీంతో విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్లో 'ఢీ' సీక్వెల్ రాబోవడం కన్ఫర్మ్ అయ్యింది. ఆరోజు తమ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉన్నట్లు మంచు విష్ణు ప్రకటిస్తారని భావిస్తున్నారు.