Begin typing your search above and press return to search.

'లాల్ సింగ్ చ‌డ్డా' ప్రీమియ‌ర్ లో టాలీవుడ్ క్రేజీ జోడీ!

By:  Tupaki Desk   |   6 Aug 2022 6:19 PM GMT
లాల్ సింగ్ చ‌డ్డా ప్రీమియ‌ర్ లో టాలీవుడ్ క్రేజీ జోడీ!
X
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించి మాజీ భార్య కిర‌ణ్ రావుతో క‌లిసి నిర్మించిన మూవీ `లాల్‌సింగ్ చ‌డ్డా`. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌రీనా క‌పూర్ హీరోయిన్ గా న‌టించింది. హాలీవుడ్ క్రేజీ హీరో టామ్ హంక్స్ న‌టించిన `ఫారెస్ట్ గంప్‌` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు.

న‌టుడు అతుల్ అగ్నిహోత్రి హిందీ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో అమీర్ ఖాన్ న‌టించిన ఈ మూవీ ఆగ‌స్టు 11న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఉత్త‌రాదిలో ఈ మూవీకి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న వేళ అమీర్ ఖాన్ ద‌క్షిణాదిపై అందులోనూ టాలీవుడ్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాంగంగా తెలుగు వెర్ష‌న్ కు మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తున్న విష‌యం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగులో ప్ర‌మోష‌న్స్ ని కూడా జోరుగా మొద‌లు పెట్టిన అమీర్ ఖాన్ సినిమా రిలీజ్ కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో బాలీవుడ్ త‌ర‌హాలో రిలీజ్ కు ఐదు రోజుల ముందే ప్ర‌త్యేకంగా టాలీవుడ్ సెల‌బ్రిటీస్ కోసం శ‌నివారం ప్రీమియ‌ర్ షోని గ‌చ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌ లో ఏర్పాటు చేశారు. ఈ షోకు యంగ్ హీరోస్ తో పాటు కింగ్ నాగార్జున‌, అక్కినేని అమ‌ల జంట‌గా పాల్గొని ప్రీమియ‌ర్ షోకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల త‌రువాత నాగార్జున‌, అమ‌ల జంట‌గా ఏ ఈవెంట్ లోనూ క‌నిపించ‌లేదు. చాలా రోజుల త‌రువాత టాలీవుడ్ క్రేజీ జోడీ అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చ‌డ్డా` ప్రీమియ‌ర్ కోసం జంట‌గా క‌లిసి బ‌య‌టికి రావ‌డం, ఫొటోల‌కు పోజులిచ్చి మీడియా ముందుకు రావ‌డం విశేషం. ఈ ప్రీమియ‌ర్ షోలో అల్లు అర‌వింద్‌, హీరో అల్లు శిరీష్, కార్తికేయ‌, స‌త్య‌దేవ్ ల‌తో పాటు మారుతి, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ న‌వీన్ యెర్నేని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఇదిలా వుంటే కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ది ఘోస్ట్` లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా న‌టిస్తున్నఈ మూవీ కీల‌క షెడ్యూల్స్ ఇటీవ‌లే దుబాయ్ లో పూర్తి చేసుకుంది. రీసెంట్ గా కిల్లింగ్ మిషిన్ అంటూ విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ మూవీని అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌బోతున్నారు.