Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబోః మ‌హేష్ - క‌మ‌ల్.. ఓ స్టార్ డైరెక్ట‌ర్!

By:  Tupaki Desk   |   3 Jun 2021 10:00 PM IST
క్రేజీ కాంబోః మ‌హేష్ - క‌మ‌ల్.. ఓ స్టార్ డైరెక్ట‌ర్!
X
ఇప్పుడు చాలా ఇండ‌స్ట్రీల్లో మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అయితే.. ఈ క్ర‌మంలో కొన్ని ఊహించని కాంబోలు కూడా డిస్క‌ష‌న్స్ లోకి వ‌చ్చేస్తున్నాయి. అందులో కొన్ని సెట్ట‌వుతున్నాయి కూడా. ఇదేవిధంగా ఇప్పుడో సూప‌ర్ కాంబో సెట్ కాబోనుంద‌నే వార్త సౌత్ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ల‌ను మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ డీల్ చేయ‌బోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

వారిలో ఒక‌రు యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ కాగా.. మ‌రొక‌రు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. వీరు సోలోగా వ‌స్తున్నారంటేనే ఫ్యాన్స్ ర‌చ్చ చేస్తారు. అలాంటిది ఈ స్టార్లు ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారంటే ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు టాలీవుడ్లో, అటు కోలీవుడ్ లో ఇదే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

వీరిద్ద‌రినీ క‌ల‌ప‌బోతున్న ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు మురుగ‌దాస్‌. క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా ఎన్నో సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసిన మురుగ‌దాస్.. తెలుగు ఆడియ‌న్స్ కు కూడా సుప‌రిచితుడే. అంతేకాదు.. మ‌హేష్ తో ‘స్పైడ‌ర్‌’ చిత్రాన్నికూడా తెరకెక్కించాడు. ఆ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ అందుకోలేదు. అందుకే.. మ‌రోసారి సూప‌ర్ కాంబోతో వ‌చ్చేస్తున్నాడ‌నే చ‌ర్చ సాగుతోంది.

అంతేకాదు.. ఈ స్టోరీ లైన్ కూడా సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. మ‌హేష్ ఈ మూవీలో సీబీఐ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నార‌ని, క‌మ‌ల్ ఓ యువ‌తి తండ్రి పాత్ర‌లో క‌నిపిస్తార‌ని టాక్‌. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత‌? ఎప్పుడు ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌నేది చూడాలి.

ప్ర‌స్తుతానికి క‌మ‌ల్‌, మ‌హేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. మ‌హేష్ స‌ర్కారువారి పాట కంప్లీట్ అయిన త‌ర్వాత రాజ‌మౌళి సినిమా చేయాల్సి ఉంది. మ‌ధ్య‌లో త్రివిక్ర‌మ్ మూవీ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. అటు క‌మ‌ల్ ‘విక్ర‌మ్‌’తోపాటు ‘ఇండియన్2’ చేయాల్సి ఉంది. అటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. మరి, ఇవన్నీ క్లియర్ అయ్యి ఈ కాంబో ఎప్పుడు సెట్టవుతుందో చూడాలి.