Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఇది!

By:  Tupaki Desk   |   22 March 2022 6:00 AM IST
ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఇది!
X
ఇప్పడు ఎక్కడ చూసినా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియాలో ఎక్కడ చూసినా రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ కనిపిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

దాంతో ప్రమోషన్స్ మరింత ఊపందుకుంటున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - చరణ్ అభిమానులు కూడా తమదైన స్టైల్లో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాలుపంచుకుంటున్నారు.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కి చెందిన ఎన్టీఆర్ అభిమానులు ఖరీదైన 70 కార్లతో ర్యాలీని తీశారు. ర్యాలీ అనంతరం సువిశాలమైన ప్రదేశంలో 'జై ఎన్టీఆర్ .. ఆర్ ఆర్ ఆర్' అనే ఆంగ్ల అక్షరాల రూపంలో కార్లను ఉంచారు. ఈ ర్యాలీని ఫ్లై కెమెరాతో చిత్రీకరించిన తీరు బాగుంది.

వివిధ కంపెనీలకు చెందిన .. వివిధ రంగుల కార్లను ఉపయోగించి పక్కాగా డిజైన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్లు సక్సెస్ చేశారు. ఎన్టీఆర్ పట్ల తమకి గల అభిమానాన్ని వాళ్లంతా ఈ విధంగా చాటుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది.

సాధారణంగా కథ ఏదైనా కొంతమందికి లవ్ ట్రాక్ నచ్చితే .. మరికొంతమందికి ఎమోషన్స్ నచ్చుతాయి. కొంతమందికి పాటలు నచ్చితే .. ఇంకొందరికి ఫైట్లు నచ్చుతాయి. వీటన్నిటినీ దేశభక్తితో ముడిపెడితే ఆ అంశాలన్నీ అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే దేశభక్తి అనేది అందరిలో అంతర్లీనంగా ఉంటుంది.

అందుకు సంబంధించిన సన్నివేశాలు .. పాటలు తెరపై వస్తున్నప్పుడు హృదయం ఉప్పొంగడానికి అదే కారణం. అలాంటి సన్నివేశాలు 'ఆర్ ఆర్ ఆర్' లో అడుగడుగునా కనిపించనున్నాయి. అలాంటి సీన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి సిద్ధహస్తుడని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

బలమైన కథాకథనాలు .. ఆసక్తికరమైన సన్నివేశాలు .. అనూహ్యమైన మలుపులు .. ఉద్వేగపూరితమైన డైలాగ్స్ .. ఉత్తేజపూరితమైన పాటలు .. అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయి. 'బాహుబలి' .. 'బాహుబలి 2' తరువాత రాజమౌళి చేసిన సినిమా కావడం, ఇది ఆ సినిమాల కంటే పెద్దది అని రాజమౌళి చెప్పడం అభిమానుల్లో మరింతగా ఆసక్తిని పెంచుతోంది. ఓపెనింగ్స్ తో మొదలయ్యే రికార్డులు ఎంతవరకూ వెళతాయో .. ఎక్కడ ఆగుతాయో అనే విషయంపై అప్పుడే చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

https://twitter.com/MelbNTRFans/status/1505869449202892805?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1505869449202892805|twgr^|twcon^s1_&ref_url=https://d-8579228052219867738.ampproject.net/2203041950000/frame.html