Begin typing your search above and press return to search.

మెగా డాటర్‌ ప్రొడక్షన్‌ టీం మెంబర్స్‌ కు పాజిటివ్‌

By:  Tupaki Desk   |   24 July 2020 12:45 PM IST
మెగా డాటర్‌ ప్రొడక్షన్‌ టీం మెంబర్స్‌ కు పాజిటివ్‌
X
మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొన్ని రోజుల క్రితం గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థలో ఆనంద్‌ రాగ దర్శకత్వంలో ఒక వెబ్‌ సిరీస్‌ ను సుష్మిత దంపతులు నిర్మిస్తున్నారు. జీ 5 లో స్ట్రీమింగ్‌ కాబోతున్న ఆ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ చకచక జరుగుతున్న సమయంలో కరోనా వారి జోరుకు బ్రేక్‌ వేసింది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్‌ చిత్రీకరణ పూర్తి చేసిన యూనిట్‌ సభ్యులు కరోనా కారణంగా షూటింగ్‌ ను నిలిపేశారట.

యూనిట్‌ సభ్యుల్లో ఒక్కరికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో ప్రస్తుతం ఇతర టెక్నీషియన్స్‌ మరియు నటీనటులు అతడితో క్లోజ్‌ కాంటాక్ట్‌ అయిన వారు అంతా కూడా పరీక్షలకు వెళ్లాలని సుష్మిత సూచించారు. పరీక్షలు చేయించుకున్న తర్వాత కూడా కనీసం రెండు వారాలకు తగ్గకుండా స్వీయ నిర్భందంలో ఉండాల్సిందిగా పేర్కొన్నారు. దీంతో రెండు వారాల పాటు షూటింగ్‌ కు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.

‘ఎక్స్‌ఎంజ్‌ ఆఫ్‌ ఫైర్‌’ అనే టైటిల్‌ తో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ లో కీలక పాత్రను ప్రకాష్‌ రాజ్‌ ఇంకా సంపత్‌ రాజ్‌ లు పోషిస్తున్నారు. సుష్మిత ఈ వెబ్‌ సిరీస్‌ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలలో జీ 5లో స్ట్రీమింగ్‌ మొదలు పెట్టాలనుకుంటూ ఉండగా ఇలా జరగడంతో ఆమె నిరుత్సాహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేపట్టాలని యూనిట్‌ సభ్యులకు ఆమె సూచించారట.