Begin typing your search above and press return to search.

డ్రైవ‌ర్ కి కోవిడ్ పాజిటివ్ మ‌హేష్ ఫ్యామిలీకి టెస్టులు!

By:  Tupaki Desk   |   29 March 2021 4:00 PM IST
డ్రైవ‌ర్ కి కోవిడ్ పాజిటివ్ మ‌హేష్ ఫ్యామిలీకి టెస్టులు!
X
ఎంత జాగ్ర‌త్త తీసుకున్నా ఏదోలా అంటుకుంటోంది. అందుకే క‌రోనా అంత‌టి ప్ర‌మాద‌క‌ర‌ వైర‌స్ దేశంలో మ‌రొక‌టి లేద‌న్నది అంద‌రి అభిప్రాయం. మాస్కులు ధ‌రిస్తున్నా.. శానిటైజ‌ర్లు ఉప‌యోగిస్తున్నా ఏ రూపంలో ఎవ‌రికి చేరుతుందో ఎవ‌రికీ అర్థం కాని ప‌రిస్థితి. సెకండ్ వేవ్ లో ఇప్ప‌టికే ప‌లువురు టాప్ సెల‌బ్రిటీల‌కు క‌రోనా సోకడం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం వారంద‌రికీ చికిత్స సాగుతోంది.

తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ డ్రైవ‌ర్ కి క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే ఆ ఇంట్లో ప్యానిక్ అయ్యార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ఖ్యాత‌ యాహూ క‌థ‌నం ప్రకారం.. డ్రైవ‌ర్ కి పాజిటివ్ అని తెలియ‌గానే వెంటనే మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్క‌ర్ కుటుంబ సభ్యులందరికీ వైరస్ పరీక్షలు చేయించారు. అంతా సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత మాత్రమే హ‌మ్మ‌య్య‌! అంటూ ఒక నిట్టూర్పు నిట్టూర్చార‌ని తెలిసింది‌.

మొత్తానికి ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల‌కు ఊపిరి తీసుకునే స‌మ‌య‌మే ఇది. ఇంత‌కుముందు ఎనిమిది నెల‌ల పాటు సూపర్ స్టార్ మ‌హేష్- న‌మ్ర‌త బృందం త‌మ పిల్లలతో ఇంట్లోనే ఉన్నారు. బ‌య‌ట‌కు వెళితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇటీవ‌లే స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ కోసం మ‌హేష్ షూటింగ్ స్పాట్ ల‌కు వెళుతున్నారు. దుబాయ్ షెడ్యూల్ త‌ర్వాత అత‌డు పూర్తి బిజీగా ఉన్నారు. ఈలోగానే ఈ వార్త క‌ల‌క‌లం రేపింది. ఏదేమైనా మ‌హేష్ అత‌డి కుటుంబం వైర‌స్ భారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉన్నార‌న్న‌ది అభిమానుల‌కు గుండె నిబ్బ‌రం పెంచుతోంది.