Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ టికెట్ ధరల పెంపుపై కోర్టు ఝలక్
By: Tupaki Desk | 8 April 2021 3:31 PM IST`వకీల్ సాబ్` నిర్మాతలు పంపిణీదారులకు కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వకీల్ సాబ్ టికెట్ ధరలను రెండు వారాల పాటు పెంచాలని జారీ చేసిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ధరలు యథాతథంగా పాతవే కొనసాగాలని ఆర్డర్ వేసింది. నిజానికి ఇది ఊహించని షాక్.
తాజా తీర్పు అనంతరం అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ల నుంచి ఎగ్జిబిటర్లకు నోటీసులు అందాయని తెలుస్తోంది. పెద్ద సినిమాలకు తొలి రెండు వారాల పెంపు రద్దయిందని.. పెంచిన టిక్కెట్ ధరలను తగ్గించాలని మునుపటిలా పాత ధరలనే కొనసాగించాలని .. ఇప్పటికే అమ్ముకున్న టికెట్లను క్యాన్సిల్ చేయాలని కూడా కలెక్టర్లు మెమోని జారీ చేయగా అది నిర్మాతలు పంపిణీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేపటి నుంచి కాకినాడ సహా ప్రధాన నగరాల్లో థియేటర్లలో టికెట్ ధర పెంపు అమలు కావడం లేదని స్థానిక పంపిణీదారు ఒకరు వెల్లడించారు.
నిజానికి పంపిణీదారులు కొన్ని వారాల క్రితం టికెట్ పెంపునకు అనుమతులను దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టు నుండి సానుకూల ఆమోదం పొందారు. ప్రతిసారీ పెద్ద సినిమాలకు ఇలానే జరుగుతుంది. కానీ ఈసారి అకస్మాత్తుగా హైకోర్టు అన్ని ఉత్తర్వులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం షాక్ కి గురి చేసింది. ఇంతలోనే ఈ పరిణామం ఊహించనిది అని డిస్ట్రిబ్యూటర్లలో చర్చ సాగుతోంది.
టికెట్ ధరలను ఎటువంటి పెంపు లేకుండా పర్యవేక్షించాలని కలెక్టర్లను హైకోర్ట్ కోరింది. నిజానికి వకీల్ సాబ్ పవన్ కంబ్యాక్ మూవీ కావడంతో ఆడియెన్ లో విపరీతమైన హైప్ నెలకొంది. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రదర్శనలు చెల్లింపు ప్రీమియర్ లను భారీగా ప్లాన్ చేసి టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ లో పెంచారు. కానీ కోర్టు తీర్పుతో పంపిణీ వర్గాలు ఎగ్జిబిటర్లు రిలీజ్ డే నుండే ధరలను తగ్గించాల్సి ఉంటుంది. మొదటి రోజు అమ్మిన టిక్కెట్లు ప్రదర్శనల గురించి కాస్త అస్పష్టత నెలకొందని పంపిణీ వర్గాల వాకబులో తెలిసింది. వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో రిలీజ్ కి సిద్ధమవుతుండగా ఓపెనింగ్ రికార్డుల్ని అంచనా వేస్తుండగా తాజా కోర్టు ఆర్డర్ బిగ్ షాక్ గా ఉందని చెబుతున్నారు. మరోవైపు టికెట్ పెంపుపై ఎగ్జిబిటర్లు- పంపిణీదారులు విజయవాడలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్మాతలతోనూ చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.