Begin typing your search above and press return to search.
ఖాన్ లపై కేసుకు నో చెప్పిన కోర్టు
By: Tupaki Desk | 8 Jun 2016 12:05 PM ISTబిగ్ బాస్ 9 కోసం చేసి ఓ ఎపిసోడ్ లో.. షారుక్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లు హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ.. కొన్నాళ్ల క్రితం కొందరు కోర్టు మెట్లెక్కారు. ఓ హిందూ ఆలయం సెట్ లో.. వెనుక కాళికామాత కనిపిస్తుండగా.. వీరు షూస్ తో కనిపిస్తారు. దీనిపై అందిన ఫిర్యాదుతో.. పోలీసు నివేదిక కోరింది తిస్ హజారీ కోర్టు.
అయితే.. ఇది ఓ స్టూడియోలో అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన ఆలయం అని, స్టూడియోలో నిర్మించి, మళ్లీ తొలగించేశారని.. పోలీసులు నివేదించారు. రియాల్టీ షో కోసం ఏర్పాటు చేసిన ఈ సెట్ లో కనిపించిన ఇద్దరు యాక్టర్లకు.. ఉద్దేశ్యపూర్వకంగా మతపరమైన సెంటిమెంట్స్ ను గాయపరిచే ఉద్దేశ్యం లేదని యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను అందించారు పోలీసులు. దీంతో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసిన లాయర్ గౌరవ్ గులాటి అభ్యర్ధనను కోర్టు తోసి పుచ్చింది.
సల్మాన్ ఖాన్ - షారూక్ ఖాన్ లతో పాటు.. కలర్స్ ఛానల్ - ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ - డైరెక్టర్లపై ఐపీసీ సెక్షన్స్ 295ఏ - 298 - 34 ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్స్ చేసినా.. కోర్టు తిరస్కరించింది. అయితే.. ముందస్తు ఆధారాలను అక్టోబర్ 14న సమర్పించేందుకు మాత్రం ఫిర్యాదు చేసిన వ్యక్తికి అనుమతించింది కోర్టు. కేసు ప్రస్తుతం ఉన్న స్థాయి ప్రకారం చూస్తే.. ఈ కేసు అటకెక్కేసినట్లే.
