Begin typing your search above and press return to search.

ఆ సినిమాపై అలియా భ‌ట్ కు కోర్టు నోటీసులు.. స‌మాధానం చెప్పాల‌ని ఆదేశం!

By:  Tupaki Desk   |   25 March 2021 9:00 PM IST
ఆ సినిమాపై అలియా భ‌ట్ కు కోర్టు నోటీసులు.. స‌మాధానం చెప్పాల‌ని ఆదేశం!
X
బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ టైటిల్ రోల్ లో.. ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న‌చిత్రం ‘గుంగూబాయీ క‌తియావాడీ’. ముంబై రెడ్ లైట్ ఏరియాలోని కామాటిపురలో వేశ్యాగృహాల‌ను నిర్వ‌హించిన గంగూబాయీ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

అయితే.. చ‌నిపోయిన త‌న త‌ల్లిని కించ‌ప‌రిచేలా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నార‌ని ఆమె ద‌త్త‌పుత్రుడు బాబూజీ రాజీషా ముంబై కోర్టును ఆశ్ర‌యించారు. త‌న త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తున్న‌ అలియాభ‌ట్ తోపాటు ద‌ర్శ‌కుడు భ‌న్సాలీపై ప‌రువు న‌ష్టం దావావేశారు. గంగూబాయి జీవితంపై ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’పేరుతో పుస్తకం రాసిన హుస్సేన్ జైదీపైనా దావా వేశారు.

ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం.. న‌టికి, ద‌ర్శ‌కుడితోపాటు పుస్తక రచయితకు సైతం స‌మ‌న్లు జారీచేసింది. మే 21లోపు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీచేసింది. కాగా.. ఈ చిత్రం ఇప్ప‌టికే సెట్స్ పై ఉంది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ కు క‌రోనా రావ‌డంతో మ‌ధ్య‌లో షూటింగ్ నిలిచిపోయింది.

ఇప్పుడు భ‌న్సాలీ కోలుకోవ‌డంతో మ‌ళ్లీ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రాన్ని జులై 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్‌. మ‌రి, కోర్టుకు వీరు ఎలాంటి స‌మాధానం చెపుతారు? న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెబుతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.