Begin typing your search above and press return to search.

తమిళ కొరియర్ బాయ్ ఇప్పుడా..?

By:  Tupaki Desk   |   10 Aug 2016 6:25 AM GMT
తమిళ కొరియర్ బాయ్ ఇప్పుడా..?
X
కొరియర్ బాయ్ కళ్యాణ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాంచి ఊపు మీద సాగుతున్న నితిన్ కు బ్రేకులేసిన సినిమా. ఏడాదికి పైగా వాయిదాల మీద వాయిదాలు పడి గత ఏడాది సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేసిన నితిన్ అభిమానులు.. ఆ తర్వాత మాత్రం ఇది ఎందుకు రిలీజయ్యిందా అనుకున్నారు. సినిమాకు అలాంటి ఫలితం వచ్చింది.

ప్రేమ్ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్ని తమిళం-తెలుగు రెండు వెర్షన్లలో తీయడం అలవాటైన గౌతమ్.. ఈ చిత్రాన్ని కూడా తమిళంలోనూ నిర్మించాడు. అక్కడ కూడా యామి గౌతమే కథానాయిక. ‘తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజాలుమ్’ పేరుతో జై హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో విడుదలైన పది నెలల తర్వాత ఇన్నాళ్లకు రిలీజవడం విశేషం.

రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పోలిస్తే తమిళంలో రెస్పాన్స్ పర్వాలేదు. కానీ సినిమా మాత్రం పెద్దగా ఆడే పరిస్థితులు కనిపించట్లేదు. ఇంతకుముందు గౌతమ్ మీనన్ నిర్మాణంలో వచ్చిన ‘సెగ’ కూడా ఫ్లాపైంది. దర్శకుడిగా సూపర్ హిట్లు చాలానే తీసిన గౌతమ్.. నిర్మాతగా మాత్రం చాలా వరకూ ఫెయిల్యూర్లే ఇచ్చాడు.