Begin typing your search above and press return to search.

కళ్యాణ్ వర్సెస్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   18 Sept 2015 9:51 AM IST
కళ్యాణ్ వర్సెస్ కళ్యాణ్
X
నిన్న వినాయక చవితి సందర్భంగా కాస్త లో ప్రొఫైల్ లో నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' - నయనతార 'మయూరి' సినిమాలు విడుదలైన సంగతి తెలిసినదే. సరికొత్త కధాంశంతో ఆద్యంతం థ్రిల్లింగ్ గా తెరకెక్కించామని కొరియర్ బాయ్ చిత్రం, మా సినిమాని చూసి భయపడకపోతే 5లక్షలిస్తామని మయూరి చిత్రం వార్తలలో నిలిచింది.

అయితే ఈ రెండు సినిమాలు శెలవురోజున విడుదలైనా సరైన పబ్లిసిటీ కరువవడంతో అనుకున్న రీతిలో ఓపెనింగ్స్ దక్కించుకొలేకపొయాయి. కాకపోతే సినిమాలలో కంటెంట్ వుండడంతో మౌత్ టాక్ ద్వారా వీకెండ్ కి కలెక్షన్ లు పెరిగే అవకాశం వుంది. మాస్ ఎలిమెంట్స్ రెండు సినిమాలలోనూ లేకపోవడం వీటికి ఒకరకంగా వరమైతే మరొకరకంగా శాపం.

చిత్రాలని చూసి పాజిటీవ్ రివ్యూలు రాస్తున్న ఈ సమయంలో అటు కొరియర్ బాయ్ కళ్యాణ్ ని నితిన్, ఇటు మయూరిని నిర్మాత సి.కళ్యాణ్ విరివిగా ఈ మూడు రోజులూ ప్రచారం చేస్తే మంచి ఫలితాలని రాబట్టే అవకాశం పుష్కలంగా వుంది. చూద్దాం ఈ కళ్యాణ్ వర్సెస్ కళ్యాణ్ పోరులో ఎవరు విజయం సాధిస్తారో..